బళ్లారి జిల్లా కంప్లి కోట దగ్గర దారుణ ఘటన.. అనుమానంతో ఆళినే చంపేసిన ఓ కసాయి భర్త..

అనుమానం పెనుభూతమై కట్టుకున్న ఆళినే కడతేర్చాడు ఓ కసాయి భర్త. బళ్లారి జిల్లా కంప్లి కోట దగ్గర జరిగిన ఈ దారుణ ఘటన వల్ల అభం శుభం తెలియని ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.

  • Publish Date - 12:02 pm, Sun, 22 November 20
బళ్లారి జిల్లా కంప్లి కోట దగ్గర దారుణ ఘటన.. అనుమానంతో ఆళినే చంపేసిన ఓ కసాయి భర్త..

అనుమానం పెనుభూతమై కట్టుకున్న ఆళినే కడతేర్చాడు ఓ కసాయి భర్త. బళ్లారి జిల్లా కంప్లి కోట దగ్గర జరిగిన ఈ దారుణ ఘటన వల్ల అభం శుభం తెలియని ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కంప్లి కోట 1వ వార్డులో నివసించే దుర్గప్ప, హేమలతకు పదిహేను సంవత్సరాల క్రితం వివాహం అయింది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అన్యోన్యంగా జీవించే వారి కాపురంలో ఇటీవల గొడవలు మొదలయ్యాయి. ఎవరో చెప్పిన మాటలు విన్నదుర్గప్పకు భార్యపై అనుమానం మొదలైంది. ఇంటి దగ్గరలో ఉన్న ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నావంటూ రోజూ భార్యతో గొడవ పడేవాడు. అర్ధరాత్రి కూడా ఇదే విషయమై భార్యతో గొడవపడ్డాడు. అంతటితో ఊరుకోకుండా పదునైన కత్తితో భార్యపై విచక్షణా రహితంగా దాడి చేసి హతమార్చాడు. అయితే ఆ ఇంటిలో అరుస్తున్న శబ్దాలకు పక్కన ఉండే ఓ వ్యక్తి దుర్గప్పను ఆపడానికి ప్రయత్నించాడు కానీ అతడిపై కూడా దాడి చేసి దుర్గప్ప పారిపోయాడు. స్థానికుల ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు దుర్గప్పను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. హేమలత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బల్లారి ఆస్పత్రికి తరలించారు.