AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నరసాపురంలో నకిలీ డాక్టర్.. పదో తరగతితో పలు రోగాలకు వైద్యం..

ఆధునిక కాలంలో వింత వింత రోగాలతో ప్రజలు ఇబ్బందిపడుతుంటే.. మరోవైపు కొంతమంది ఆకతాయిలు నకిలీ డాక్టర్ల అవతారమెత్తి నట్టేట ముంచుతున్నారు.

నరసాపురంలో నకిలీ డాక్టర్.. పదో తరగతితో పలు రోగాలకు వైద్యం..
uppula Raju
|

Updated on: Nov 22, 2020 | 11:29 AM

Share

ఆధునిక కాలంలో వింత వింత రోగాలతో ప్రజలు ఇబ్బందిపడుతుంటే.. మరోవైపు కొంతమంది ఆకతాయిలు నకిలీ డాక్టర్ల అవతారమెత్తి నట్టేట ముంచుతున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పదో తరగతి చదివిన ఓ వ్యక్తి జనాలకు వైద్యం చేస్తున్నాడు.. కొంతమంది స్థానికుల ఫిర్యాదుతో తనిఖీలు నిర్వహించిన ఉన్నత అధికారులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి.

నరసాపురం బ్రాహ్మణ సమాఖ్య భవనం రోడ్డులో సతీశ్ అనే వ్యక్తి గాబ్రేల్ పేరుతో ఓ క్లినిక్ నిర్వహిస్తున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా స్థానికులతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు వైద్యం అందిస్తున్నాడు. ఉన్నత చదువులు చదివిన పెద్ద పెద్ద డాక్టర్లే కొన్ని వ్యాధులను నయం చేయలేక చతికిలపడుతుంటే ఈయన మాత్రం కరోనాతో పాటు అన్ని రోగాలకు చికిత్స అందిస్తానని ప్రకటించుకున్నాడు. విషయం తెలసిన జిల్లా వైద్యాధికారి ఆస్పత్రిపై తనిఖీలు నిర్వహించి సర్టిఫికెట్లు, అనుమతులు చూపాలని ఆదేశించాడు. వెంటనే సతీశ్ తాను పదో తరగతి వరకు మాత్రమే చదివానని, పీఎంపీ, ఆర్ఎంపీ సర్టిఫికెట్ కూడా ఏమీ లేదని ఓప్పుకున్నాడు. వెంటనే అధికారులు ఆస్పత్రని సీజ్ చేసి, అక్కడ అన్న మందులను, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నగరంలో సతీశ్ మాదిరి వైద్యం బిజినెస్ చేసేవారు చాలామంది ఉన్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. వారందరికీ విషయం తెలియడంతో చాలా మంది క్లినిక్‌లు మూసేసి పరారవుతున్నారు.

అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
ఉలవల బెనిఫిట్స్ తెలిస్తే ఒక్క రోజూ కూడా మిస్ చెయ్యరు
ఉలవల బెనిఫిట్స్ తెలిస్తే ఒక్క రోజూ కూడా మిస్ చెయ్యరు
మూడో కంటికి తెలియకుండా.. వారు అనుకున్నది సాధిస్తారు..!
మూడో కంటికి తెలియకుండా.. వారు అనుకున్నది సాధిస్తారు..!
చెత్త ఫీల్డింగ్‌తో నవ్వులపాలైన పాకిస్తాన్ ఫ్యూచర్ స్టార్
చెత్త ఫీల్డింగ్‌తో నవ్వులపాలైన పాకిస్తాన్ ఫ్యూచర్ స్టార్
కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! ప్రచారంలో నిజమెంత..?
కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! ప్రచారంలో నిజమెంత..?
పచ్చి గుడ్లు తాగితే ఎక్కువ బలం వస్తుందా..? అపొహలు కాదు అసలు..
పచ్చి గుడ్లు తాగితే ఎక్కువ బలం వస్తుందా..? అపొహలు కాదు అసలు..
ఎన్నో కలలు కన్నాడు.. కానీ తలనొప్పి అతని జీవితానికి శాసనం రాసింది.
ఎన్నో కలలు కన్నాడు.. కానీ తలనొప్పి అతని జీవితానికి శాసనం రాసింది.