జీహెచ్‌ఎంసీ పోలింగ్..డిసెంబర్ 1న సెలవు దినంగా ప్రకటించిన ప్రభుత్వం
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ ఒకటిన సాధారణ సెలవు దినంగా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు...

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ ఒకటిన సాధారణ సెలవు దినంగా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిరిగి జిల్లాల పరిధిలోని దుకాణ సముదాయాలు, వ్యాపారసంస్థలు, గవర్నమెంట్ ఉద్యోగులతో పాటు ఇతర ప్రైవేటు కంపెనీలకు కూడా సెలవుదినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు వెలువరించింది.
కాగా, జీహెచ్‌ఎంసీ ఎలక్షన్స్‌లో మొత్తం 1,893 నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం నాటి పరిశీలనలో వివిధ కారణాల దృష్ట్యా 68 నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు రిజెక్ట్ చేశారు. ఆదివారం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఛాన్స్ ఉంది. అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల ఫైనల్ లిస్టును విడుదల చేస్తారు. డిసెంబర్ 4నఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అదే రోజు ఫలితాలు వెలువడతాయి. బ్యాలెట్ పద్ధతిలోనే ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. వికలాంగులు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, కోవిడ్ పాజిటివ్ పేషెంట్లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సౌకర్యం కల్పించింది ఎన్నికల సంఘం.
Also Read : చనిపోయినా మరికొందరి జీవితాల్లో వెలుగులు, కానిస్టేబుల్ అంత్యక్రియల్లో పాల్గొన్న సీపీ సజ్జనార్