AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చనిపోయినా మరికొందరి జీవితాల్లో వెలుగులు, కానిస్టేబుల్​ అంత్యక్రియల్లో పాల్గొన్న సీపీ సజ్జనార్

అతడో పోలీస్ కానిస్టేబుల్. ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. భార్య, తల్లిదండ్రులతో జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.

చనిపోయినా మరికొందరి జీవితాల్లో వెలుగులు, కానిస్టేబుల్​ అంత్యక్రియల్లో పాల్గొన్న సీపీ సజ్జనార్
Ram Naramaneni
| Edited By: |

Updated on: Nov 22, 2020 | 1:51 PM

Share

అతడో పోలీస్ కానిస్టేబుల్. ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. భార్య, తల్లిదండ్రులతో జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఈ క్రమంలో ఊహించని ప్రమాదం తరుముకొచ్చింది. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సదరు కానిస్టేబుల్ గాయపడి..చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసు అధికారులు అవయవ దానం చేయాలని కోరగా, తల్లిదండ్రులు గుండె దిటవుతో సరేనన్నారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా పరిగి మండల పరిధి బాబాపూర్‌లో శనివారం చోటుచేసుకుంది.

తాను చనిపోయినా..ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపిన కానిస్టేబుల్ ఆంజనేయులు అంత్యక్రియల్లో సైబరాబాద్​ సీపీ సజ్జనార్ పాల్గొన్నారు. వికారాబాద్​ జిల్లా పరిగి మండలం బాబాపూర్ గ్రామంలో జరిగిన ఆంజనేయులు అంత్యక్రియల్లో.. స్మశానవాటిక వరకు పాడె మోశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి డిపార్ట్‌మెంట్ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

వివరాలు ఇలా ఉన్నాయి…

సైబరాబాద్ హెడ్ క్వార్టర్స్​లో ఆంజనేయులు గత రెండేళ్లుగా ఏఆర్ కానిస్టేబుల్​గా పని చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం విధులకు హాజరయ్యేందుకు మోటార్ సైకిల్‌పై వస్తుండగా సోమన్ గుర్తి గేటు వద్ద ఆంజనేయులును బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన ఆంజనేయులు కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఆంజనేయులు అవయవాలను కుటుంబ సభ్యులు జీవన్ దాన్ సంస్థకు ఇచ్చారు. చనిపోయిన ఆంజనేయులు మరొకరికి ప్రాణదానం చేశారని… అతన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సీపీ సజ్జనార్ కోరారు.

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్