AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క సినిమా… అటు ప్రొడ్యూసర్ కు 50వది.. ఇటు హీరోకు 15 వ మూవీ.. ఇంతకు ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఏంటంటే..

శ్రీ వెంకటేశ్వర బ్యానర్లో శంకర్‌ డైరెక్షన్ లో మెగాపవర్ స్టార్ చరణ్ హీరోగా దిల్ రాజు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్టు దిల్ రాజు బ్యానర్‌ నుంచి వస్తున్న 50 వ సినిమా కాగా..

ఒక్క సినిమా... అటు ప్రొడ్యూసర్ కు 50వది.. ఇటు హీరోకు 15 వ మూవీ.. ఇంతకు ఆ  క్రేజీ ప్రాజెక్ట్ ఏంటంటే..
Rajeev Rayala
|

Updated on: Feb 15, 2021 | 1:31 AM

Share

Shankar-Ram Charan movie  : శ్రీ వెంకటేశ్వర బ్యానర్లో శంకర్‌ డైరెక్షన్ లో మెగాపవర్ స్టార్ చరణ్ హీరోగా దిల్ రాజు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్టు దిల్ రాజు బ్యానర్‌ నుంచి వస్తున్న 50 వ సినిమా కాగా… చరణ్ హీరోగా యాక్ట్‌ చేస్తున్న 15 వ సినిమా.. ఇలా ఓకే సినిమా ఇటు ఓ హీరోకు… అటు ఓ ప్రొడ్యూసర్‌కు ఓ మైల్ స్టోన్‌లా నిలవబోతోంది.  ఇక తమిళ స్టార్‌ డైరెక్టర్ శంకర్‌ రామ్‌ చరణ్ హీరోగా సినిమాను అనౌన్స్‌ చేయడంతో… తమిళ, తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా ఎలా ఉండాలనే టాక్‌లోనే టైం పాస్ చేస్తోంది. ఇక ఈ కాంబినేషన్ పై ఇండస్ట్రీ పెద్దలు కూడా మాట్లాడుతూ.. అప్పుడే ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. వీరిక తోడు డైరెక్టర్ శంకర్, హీరో రామ్‌ చరణ్‌లు కూడా.. సినిమాను స్టార్ట్‌ చేయడం కోసం ఈగర్‌లీ వెయిట్‌ చేస్తున్నామని ట్వీట్ చేశారు. ఇక ఈ సినిమా పై నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌ మాట్లాడుతూ ‘‘మేం సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలవుతోంది. ఈ ప్రయాణంలో అగ్ర కథానాయకులతోనూ, కొత్తతరంతోనూ, దర్శకులతోనూ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే చిత్రాల్ని రూపొందించాం. ఇప్పుడు మా 50వ సినిమాని చరణ్‌ కథానాయకుడిగా నిర్మిస్తుండడం ఆనందంగా ఉంది. చరణ్‌ – శంకర్‌ కలయిక, అది పాన్‌ ఇండియా స్థాయి చిత్రం అంటే అంచనాలు పెద్దయెత్తున ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే, ప్రేక్షకులంతా ఆస్వాదించేలా ఈ సినిమాని రూపొందిస్తాం. త్వరలోనే నటీనటులు, సాంకేతిక బృందం వివరాల్ని తెలియజేస్తాం’’ అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Young Indians of 2020: ఈ ఏడాది యువ డైనమిక్‌ వ్యక్తుల జాబితాలో చేరిన ఏకైక ఇండియన్ హీరోగా అల్లువారబ్బాయి రికార్డ్

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్