AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెద్ద నోట్ల రద్దులో అవినీతి

పెద్ద నోట్ల రద్దు పేరుతో బీజేపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ మంగళవారం మీడియా సమావేశంలో ఓ వీడియోను విడుదల చేశారు. దీనిపై కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె కాంగ్రెస్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో లబ్ధిపొందడానికే ఫేక్ వీడియోను విడుదల చేశారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. వీడియోకు సంబంధించిన వ్యవహారంపై బీజేపీ న్యాయసలహా తీసుకుంటోందని, కాంగ్రెస్ పార్టీ నేతలతో సహా […]

పెద్ద నోట్ల రద్దులో అవినీతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 28, 2019 | 12:23 PM

Share

పెద్ద నోట్ల రద్దు పేరుతో బీజేపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ మంగళవారం మీడియా సమావేశంలో ఓ వీడియోను విడుదల చేశారు. దీనిపై కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె కాంగ్రెస్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో లబ్ధిపొందడానికే ఫేక్ వీడియోను విడుదల చేశారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. వీడియోకు సంబంధించిన వ్యవహారంపై బీజేపీ న్యాయసలహా తీసుకుంటోందని, కాంగ్రెస్ పార్టీ నేతలతో సహా దీనితో సంబంధం ఉన్న వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

వీడియోను విడుదల చేయడం ద్వారా బీజేపీ ప్రతిష్టను దెబ్బతీయలేరని సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత.. ఓ బీజేపీ నేత పాత నోట్ల మార్పిడి దందాకు పాల్పడ్డాడని కాంగ్రెస్ ఆరోపించింది. సదరు నాయకుడు 40% కమీషన్ తీసుకుని, పాత నోట్లను మార్చారని ఆరోపించింది. దీనికి సంబంధించి కొందరు జర్నలిస్ట్‌లు అహ్మదాబాద్‌లో చేసిన స్టింగ్ ఆపరేషన్ తాలూకు వీడియోను విడుదల చేసింది.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు