Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం సీరియస్..మంత్రులకు మైండ్ బ్లాక్..ఎందుకంటే ?

ఏపీ సీఎం జగన్‌కు కోపం వచ్చింది.  అలాంటి ఇలాంటి కోపం కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయకపోతే, పోస్టులూడిపోతాయని వార్నింగ్ ఇచ్చేంతటి కోపం వచ్చిందట ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి. జిల్లాలపై గట్టిగా ఫోకస్‌ పెట్టండి..జిల్లాలపై పట్టు పెంచుకోండి..ప్రజలకు అందుబాటులో ఉండండి ఇవీ జగన్ కేబినెట్ మంత్రులకు ఇటీవల ఇచ్చిన ఆదేశాలు. ఆదేశాలు బేఖాతరు చేస్తే.. అంతే సంగతి అనుకూడా అన్నారట జగన్. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి దాదాపు ఐదు నెలలు అవుతోంది. […]

సీఎం సీరియస్..మంత్రులకు మైండ్ బ్లాక్..ఎందుకంటే ?
Follow us
Rajesh Sharma

|

Updated on: Oct 31, 2019 | 7:57 PM

ఏపీ సీఎం జగన్‌కు కోపం వచ్చింది.  అలాంటి ఇలాంటి కోపం కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయకపోతే, పోస్టులూడిపోతాయని వార్నింగ్ ఇచ్చేంతటి కోపం వచ్చిందట ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి. జిల్లాలపై గట్టిగా ఫోకస్‌ పెట్టండి..జిల్లాలపై పట్టు పెంచుకోండి..ప్రజలకు అందుబాటులో ఉండండి ఇవీ జగన్ కేబినెట్ మంత్రులకు ఇటీవల ఇచ్చిన ఆదేశాలు. ఆదేశాలు బేఖాతరు చేస్తే.. అంతే సంగతి అనుకూడా అన్నారట జగన్.
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి దాదాపు ఐదు నెలలు అవుతోంది. పాలనలో తనదైన ముద్ర వేస్తూ..సీఎం జగన్ ముందుకు వెళుతున్నారు.. మేనిఫెస్టో, పాదయాత్ర లో ఇచ్చిన హామీల అమలు పై దృష్టి సారించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ ఆయనలో ఓ అసంతృప్తి మాత్రం ఉందట. తన టీమ్ చాలా వెనుకబడి ఉందని..పాలనలో మార్క్‌ చూపించడం లేదని…ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టడం లేదని సీఎంలో అసంతృప్తి ఉందట. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ కేబినెట్‌ మీటింగ్‌లో మంత్రులకు సీఎం క్లాస్‌ పీకారట.
సచివాలయంలో మంత్రులు అందుబాటులో ఉండటం లేదని ..ప్రజలు ,ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్నారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారట. ప్రతి మంగళవారం, బుధవారం ఖచ్చితంగా సచివాలయంలో మంత్రులు అందుబాటులో ఉండాలని మంత్రులకు సీఎం జగన్ ఆదేశించారు. త్వరలోనే ఇసుక ఇబ్బందులు తొలిగిపోతాయని…ప్రతిపక్షం దుష్ప్రచారాలను వెంటవెంటనే తిప్పికొట్టాలని సీఎం సూచించారట. పొలిటికల్ కామెంట్లపై మంత్రులు మరింత ఎటాకింగ్ గా వెళ్లాలని ..వారి విమర్శలను తిప్పికొట్టాలని జగన్ సూచించారట.
గత ప్రభుత్వ తప్పిదాలను ప్రజల్లో ఎండగట్టాలని..ఇన్ఛార్జ్ మంత్రులు తమకు అప్పగించిన జిల్లాలపై మరింత ఫోకస్ పెట్టాలని చెప్పారట.సొంత జిల్లానే కాకుండా ఇన్ఛార్జీగా ఉన్న జిల్లాలకు సమయం కేటాయించాలన్న మంత్రులకు సీఎం ఆదేశించారు. ఆయా జిల్లాల్లోని సమస్యలను స్థానిక నేతలతో చర్చించి సమన్వయం చేసుకొని పరిష్కరించాలని సీఎం వారికి తెలిపారట.
మొత్తానికి వివిధ సమస్యలపై ప్రధాన ప్రతిపక్షం టిడిపి ,ఇతర విపక్షాల విమర్శలకు గట్టి కౌంటర్ ఇవ్వాలని..ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారనికి కృషి చేయాలని సీఎం సూచించారు. మంత్రుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని…పనితీరు మెరుగుపర్చుకోవాలని…లేకపోతే ఊరుకునేది లేదని సీఎం వార్నింగ్‌ ఇచ్చారని తెలుస్తోంది. దీంతో కొంత మంది మంత్రులు అలర్ట్‌ అయ్యారు. అప్పుడే ప్రతిపక్షంపై విమర్శలకు కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు.