కేసీఆర్ ప్రధానమంత్రి అయితే తప్పేంటి?: కవిత

హైదరాబాద్: టీఆర్ఎస్ భావిస్తున్నట్టు కేసీఆర్ ప్రధానమంత్రి అయితే కవిత కేంద్ర మంత్రి అవుతారా అన్న ప్రశ్నపై కవిత స్పందించారు. దేశ రాజకీయాలను టీఆర్ఎస్ ప్రభావితం చేయబోతుందని, అందుకు తెలంగాణ ప్రజల ఓట్లు ప్రధానం అని చెప్పారు. కేసీఆర్ ప్రధాన మంత్రి అయితే తప్పేమిటని? అన్న ప్రశ్న కూడా అందరూ వేసుకోవాలని చెప్పారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువ మంది ప్రధానులయ్యారని, తెలంగాణ నుంచి పీవీ నరసింహారావు తర్వాత కేసీఆర్ అయితే తప్పేమిటని కవిత చెప్పారు. ఈ చర్చ అంతా […]

కేసీఆర్ ప్రధానమంత్రి అయితే తప్పేంటి?: కవిత
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 27, 2019 | 4:36 PM

హైదరాబాద్: టీఆర్ఎస్ భావిస్తున్నట్టు కేసీఆర్ ప్రధానమంత్రి అయితే కవిత కేంద్ర మంత్రి అవుతారా అన్న ప్రశ్నపై కవిత స్పందించారు. దేశ రాజకీయాలను టీఆర్ఎస్ ప్రభావితం చేయబోతుందని, అందుకు తెలంగాణ ప్రజల ఓట్లు ప్రధానం అని చెప్పారు. కేసీఆర్ ప్రధాన మంత్రి అయితే తప్పేమిటని? అన్న ప్రశ్న కూడా అందరూ వేసుకోవాలని చెప్పారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువ మంది ప్రధానులయ్యారని, తెలంగాణ నుంచి పీవీ నరసింహారావు తర్వాత కేసీఆర్ అయితే తప్పేమిటని కవిత చెప్పారు.

ఈ చర్చ అంతా ఒక కొలిక్కి రావాలంటే మే 23న రిజల్ట్ వచ్చే వరకూ ఆగాల్సి ఉంటుందని, అప్పుడు సంకీర్ణ రాజకీయాల పరిస్థితిపై ఒక అవగాహన వస్తుందని ఆమె అన్నారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ లేని కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు టీఆర్ఎస్ కచ్చితంగా ప్రయత్నిస్తుందని కవిత స్పష్టం చేశారు.