కాంగ్రెస్‌లోకి శత్రుఘ్న సిన్హా?

కాంగ్రెస్‌లోకి శత్రుఘ్న సిన్హా?

బీజేపీ రెబల్ శత్రుఘ్న సిన్హా ఈ నెల 28న కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. గురువారం ఉదయం 11:30 గంటలకు సిన్హా కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ఆ పార్టీ ఎంపీ అఖిలేశ్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం పాట్నా సాహిబ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శత్రుఘ్న సిహ్నాకు ఈసారి బీజేపీ టికెట్ నిరాకరించింది. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఆ స్థానాన్ని కేటాయించింది. దీంతో కాంగ్రెస్‍లో చేరాలని సిన్హా నిర్ణయించుకున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ నెల 28న కాంగ్రెస్ […]

TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Mar 26, 2019 | 9:14 PM

బీజేపీ రెబల్ శత్రుఘ్న సిన్హా ఈ నెల 28న కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. గురువారం ఉదయం 11:30 గంటలకు సిన్హా కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ఆ పార్టీ ఎంపీ అఖిలేశ్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం పాట్నా సాహిబ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శత్రుఘ్న సిహ్నాకు ఈసారి బీజేపీ టికెట్ నిరాకరించింది. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఆ స్థానాన్ని కేటాయించింది. దీంతో కాంగ్రెస్‍లో చేరాలని సిన్హా నిర్ణయించుకున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ఈ నెల 28న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సమక్షంలో సిన్హా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం. అంతేకాదు, పాట్నా సాహిబ్ నుంచే తిరిగి బరిలోకి దిగాలని కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాట్నాలో పోటీ రసవత్తరంగా మారనుంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu