TV9 Exit Poll Results: కేంద్రపాలిత పుదుచ్చేరిలో పట్టం ఎవరికి..? ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు ఎం చెబుతున్నాయి.. ఆసక్తికర అంశాలు మీకోసం…

Puducherry Elections exit Poll Results 2021: పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించింది ఎన్నికల సంఘం. పాలక పార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? లేక విపక్ష పార్టీలు విజయం సాధిస్తాయా అన్నది ఉత్కంఠగా మారింది.

TV9 Exit Poll Results: కేంద్రపాలిత పుదుచ్చేరిలో పట్టం ఎవరికి..? ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు ఎం చెబుతున్నాయి.. ఆసక్తికర అంశాలు మీకోసం...
Union Territory Puducherry Tv9 Exit Poll Results
Follow us

| Edited By: Team Veegam

Updated on: Apr 29, 2021 | 7:24 PM

Puducherry Elections exit Poll Results 2021:ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమరం ముగిసింది. నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీలకు మినీ సంగ్రామంగా భావించిన అన్ని పార్టీలు పోటా పోటీ ప్రచారాలతో హోరెత్తించాయి. పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి ఏప్రిల్ 6 ఒకే విడతలో ఎన్నికలు జరగాయి. ఇందులో భాగంగా పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించింది ఎన్నికల సంఘం. పాలక పార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? లేక విపక్ష పార్టీలు విజయం సాధిస్తాయా అన్నది ఉత్కంఠగా మారింది. ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడవుతాయి. అయితే, పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యలంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ్టి వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించింది. దీంతో ఇవాళ వివిధ తమ సర్వేలను వెల్లడిస్తున్నాయి. ఇందులో భాగంగానే టీవీ 9 నియోజవవర్గాల వారీగా వాస్తవాలకు దగ్గరగా నిర్వహించిన సర్వేల్లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ ఏప్రిల్ 6న ఒకే దశలో ఎన్నికలు నిర్వహించారు. ఇందులో మొత్తం మూడువందలమంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థుల భవితవ్యం మే నెల 2వ తేదీన తేలనుంది. కాగా, పుదుచ్చేరిలో ముందెన్నడు లేనంతగా, అక్కడ రికార్డు స్థాయిలో 81.64 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.

చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేపిన బలపరీక్షలో విఫలమైన నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కార్ కుప్పకూలడంతో పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించారు. డీఎంకేతో కలిసి మళ్లీ అధికారం చేజిక్కించుకునేందుకు నారాయణ స్వామి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు, అధికారంలోకి వచ్చేందుకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించింది. అటు, అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. తమిళనాడులో ప్రవేశానికి పుదుచ్చేరిని తొలి మెట్టుగా అది భావిస్తోంది. అయితే, బీజేపీ కాంగ్రెస్‌ ఎన్‌ఆర్‌, అన్నాడిఎంకెలు కలసి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో పోటీ చేశాయి. ఇదిలావుంటే, పుదుచ్చేరిలో బీజేపీకి చోటివ్వరాదని కాంగ్రెస్‌,డీఎంకే, లెఫ్ట్‌ పార్టీలు కలిసి యూపీఏ కూటమిగా ఏర్పడి గట్టిగా కృషి చేశాయి. దీంతో పోటీ రసవత్తరంగా మారింది.

కాగా, టీవీ9 ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం అధికార యూపీఏ కూటమిని కాదని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికే పట్టం కట్టాయి. మొత్తం ఓటర్లలో 51.8% శాతం మంది ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపగా, 38.3% శాతం మంది యూపీఏ కూటమి వైపు మొగ్గు చూపారు. ఇతర పార్టీల వైపు 9.9% శాతం మంది ఓటర్లు మాత్రమే అండగా నిలిచినట్లు టీవీ సర్వే ఫలితాల్లో వెల్లడైంది. వివిధ సర్వే ఏజెన్సీల విశ్లేషణ కంటే భిన్నంగా ప్రజల నాడీని తెలుసుకుని, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా టీవీ 9 సర్వే నిర్వహించింది.

కేంద్ర పాలితప్రాంతమైన పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు గాను 17 – 19 సీట్లను ఎన్డీఏ కూటమికి దక్కుతుండగా, 11-13 స్థానాలను యూపీఏ కూటమి దక్కించుకోవచ్చని తెలుస్తోంది. ఎన్డీఏ ఈసారి తన ఓటు వాటా శాతాన్ని అమాంతం పెంచుకుంటుందని టీవీ9 సర్వే ఫలితాలు స్పష్టమవుతున్నాయి. దీంతో బీజేపీకి మొత్తంగా 51.8 శాతం ఓటర్లు మద్దతు పలికారని అంచనా వేస్తోంది.

ఇక, ఈసారి ఫలితాల్లో యూపీఏ కూటమి ఓటు వాటా తగ్గవచ్చని స్పష్టమవుతోంది. యూపీఏ నేత‌ృత్వంలోని కూటమికి 11 నుంచి 13 సీట్లకు మాత్రమే పరిమితం కానున్నట్లు సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఫలితాల్లో యూపీఏ కూటమి తిరిగి అధికారంలోకి రావడం కష్టమని సర్వే ఫలితాల్లో తేలిపోయింది. దీనిబట్టి చూస్తే పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం సులభమని టీవీ 9 ఎగ్జిట్ సర్వే ద్వారా స్పష్టమైంది.

కాగా, ఎన్డీఏ కూటమిలోని ఏఐఎన్‌ఆర్‌సీ పార్టీ అధినేత ఎన్ రంగస్వామి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండకపోవచ్చు తెలుస్తుంది. ఈసారి ఎన్నికల్లో ప్రస్తుత మాజీ సీఎం వి నారాయణస్వామి పోటీ చేయకపోవడంతో యూపీఏ అభ్యర్థి పేరును ప్రకటించలేదు. ఇదిలావుంటే, మే 2న అసలు ఫలితాలు వెలువడనున్నాయి. పుదుచ్చేరిలో ఓటర్లు ఏ పార్టీకి పట్టం కట్టారో తెలుసుకునేందుకు, పూర్తి ఫలితాల కోసం మరి కొద్దిరోజులు వరకు వేచి చూడాల్సిందే.

Read Also.. Exit Poll Result 2021: బెంగాల్.. దంగల్.. మమతా వైపే మహిళలు, ముస్లింలు.. టీవీ9 ఎగ్జిట్ ఫలితాలు..