ఈ ఇద్దరికి ఏమైంది? మౌనం వెనుక సీక్రెట్ అదేనా?

ఆ ఇద్దరు లీడర్లు తెలంగాణ ఏర్పాడ్డాక తొలి అయిదేళ్ళు.. ఉన్నత స్థానాల్లో కొనసాగారు.. కాలం కలిసి రాక 2018 ఎన్నికల తర్వాత కనుమరుగయ్యారు. కానీ ఒక్క ఓటమే వారిని కనుమరుగు చేసేసిందా? లేక వేరే కారణాలున్నాయా? ఈ టాపిక్ ఇప్పుడు గులాబీ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో జోరుగా వినిపిస్తోంది. సిరికొండ మధుసూదనాచారి… పలు మార్లు ఓటమి తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఊపులో భూపాలపల్లి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. మంత్రి పదవికి పోటీ […]

ఈ ఇద్దరికి ఏమైంది? మౌనం వెనుక సీక్రెట్ అదేనా?
Follow us

|

Updated on: Dec 16, 2019 | 3:51 PM

ఆ ఇద్దరు లీడర్లు తెలంగాణ ఏర్పాడ్డాక తొలి అయిదేళ్ళు.. ఉన్నత స్థానాల్లో కొనసాగారు.. కాలం కలిసి రాక 2018 ఎన్నికల తర్వాత కనుమరుగయ్యారు. కానీ ఒక్క ఓటమే వారిని కనుమరుగు చేసేసిందా? లేక వేరే కారణాలున్నాయా? ఈ టాపిక్ ఇప్పుడు గులాబీ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో జోరుగా వినిపిస్తోంది.

సిరికొండ మధుసూదనాచారి… పలు మార్లు ఓటమి తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఊపులో భూపాలపల్లి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. మంత్రి పదవికి పోటీ పడ్డారు. కానీ కారణలేవయితేనేం.. కేసీఆర్ ఆయనకు అసెంబ్లీ స్పీకర్ పోస్టు ఇచ్చారు. అయిదేళ్ళు తన పదవికి తగ్గట్టుగా హుందాగానే మధుసూదనాచారి తెలంగాణ స్పీకర్‌గా పని చేశారు. కానీ 2018 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ ఊపులోను ఓటమి పాలయ్యారు. ఆయనపై గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి.. ఆ తర్వాత పరిణామాలలో గులాబీ దళంలోనే చేరిపోయారు.

స్పీకర్‌గా పని చేసిన వ్యక్తి ఒక్క ఓటమితోనే కనుమరుగవడం ఏంటి ? అందుకు కారణం… అప్పటికీ నియోజకవర్గంలో వేళ్ళూనుకుపోవడంతోపాటు మందీ, మార్బలం, మనీ సహా అన్నింటా పైచేయి కలిగిన గండ్ర వెంకటరమణారెడ్డి పార్టీలో చేరడంతో మధుసూదనాచారి సైలెంటయ్యారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

మరోవైపు టిఎన్జీవోల సంఘం అధ్యక్షుని హోదాలో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న స్వామిగౌడ్.. 2014 ఎన్నికల తర్వాత శాసనమండలి ఛైర్మెన్ అయ్యారు. అటెండర్ స్థాయి నుంచి వచ్చిన స్వామిగౌడ్‌ను కేసీఆర్ ఏకంగా మండలి ఛైర్మెన్‌ని చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయిదేళ్ళు సాఫీగానే గడిచాయి. ఆ తర్వాత పరిణామాలు మారిపోయాయి. శాసనమండలి ఛైర్మెన్ పదవీ కాలం ముగిసిన తర్వాత స్వామిగౌడ్‌కు పొడిగింపు వస్తుందనుకున్నారు. కానీ, కేసీఆర్ ఆ పదవిని గుత్తా సుఖేందర్ రెడ్డికిచ్చారు. దాంతో తన భవిష్యత్తేంటో తెలియక స్వామిగౌడ్ సైలెంటైపోయారని పార్టీ వర్గాలంటున్నాయి.

మొత్తానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి అయిదేళ్ళలో కీలక స్థానాల్లో వున్న ఇద్దరు ఇపుడు కనుమరుగు కావడంపై చర్చ జరుగుతోంది.