AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసెంబ్లీ కాగానే డిన్నర్.. జగన్ ప్లాన్ ఏంటంటే?

రాష్ట్ర పరిపాలనలో కొత్త పంథాను అనుసరిస్తూ తనదైన శైలిని ప్రదర్శిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా అధికారులతో చక్కని సమన్వయం కోసం కొత్త ప్రయత్నాలు షురూ చేశారు. నిత్యం అధికారులకు గైడ్‌లైన్స్ ఇస్తూ వారి నుంచి తాను ఆశించిన ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి అధికారులతో మరింతగా మమేకం అయ్యేందుకు యత్నాలు చేస్తున్నారు. ఏపీ శాసనసభ శీతాకాల సమావేశాలు మంగళవారంతో ముగుస్తున్నాయి. అదే రోజు సాయంత్రం రాష్ట్రంలో కీలక స్థానాలలో వున్న అధికారులతో ప్రత్యేకంగా భేటీ […]

అసెంబ్లీ కాగానే డిన్నర్.. జగన్ ప్లాన్ ఏంటంటే?
Rajesh Sharma
|

Updated on: Dec 16, 2019 | 1:37 PM

Share

రాష్ట్ర పరిపాలనలో కొత్త పంథాను అనుసరిస్తూ తనదైన శైలిని ప్రదర్శిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా అధికారులతో చక్కని సమన్వయం కోసం కొత్త ప్రయత్నాలు షురూ చేశారు. నిత్యం అధికారులకు గైడ్‌లైన్స్ ఇస్తూ వారి నుంచి తాను ఆశించిన ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి అధికారులతో మరింతగా మమేకం అయ్యేందుకు యత్నాలు చేస్తున్నారు.

ఏపీ శాసనసభ శీతాకాల సమావేశాలు మంగళవారంతో ముగుస్తున్నాయి. అదే రోజు సాయంత్రం రాష్ట్రంలో కీలక స్థానాలలో వున్న అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు రెడీ అవుతున్నారు సీఎం. ఏపీలో వివిధ హోదాల్లో పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఈ విందు భేటీకి ముఖ్యమంత్రి తరపున సీఎంఓ అధికారులు ఆహ్వానిస్తున్నారు. జిల్లాల స్థాయిలో జాయింట్ కలెక్టర్లు, అడిషనల్ ఎస్పీల స్థాయి నుంచి సచివాలయంలోని సీనియర్ ప్రిన్సిపల్ సెక్రెటరీల దాకా ఈ విందుకు హాజరు కావాలని సీఎంఓ వర్గాలు వర్తమానాలు పంపాయి.

మంగళవారం శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత విజయవాడ పున్నమిఘాట్‌లోని బెరం పార్కు ఆవరణలో సీఎం విందు జరుగుతుంది. అయితే, ముఖ్యమంత్రి స్థాయిలో ఏర్పాటవుతున్న విందు పట్ల అధికారుల్లో పెద్ద చర్చే జరుగుతోంది. కొందరు ముఖ్యమంత్రి దృష్టిలో పండేందుకు వినూత్న అంశాలతో ప్రజెంటేషన్లు సిద్దం చేసుకుంటున్నారని సమాచారం. పరిపాలనలో కొత్త విధానాలను వివరించేందుకు ముఖ్యమంత్రి సమయం కోరేందుకు కొందరు సిద్దమవుతున్నారని తెలుస్తోంది. విందు భాగంగా ప్రతీ టేబుల్ దగ్గర 15-20 ని.లు గడిపేలా ముఖ్యమంత్రి ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నారని సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఒక టేబుల్ దగ్గర ఆరుగురు వున్నా ప్రతీ ఒక్కరికీ కనీసం 3 నుంచి 5 ని.లు ముఖ్యమంత్రితో మాట్లాడే ఛాన్స్ దక్కుతుంది. దాంతో ఈ భేటీ అటు అధికారులకు, ఇటు ముఖ్యమంత్రికి ఉభయతారకంగా ఉపయోగపడుతుందని చెప్పుకుంటున్నారు.