AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఫైటర్’‌తో రొమాన్స్‌కు జాన్వీ సై..

యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండకు తెలుగులోనే కాదు.. బాలీవుడ్‌లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. బీ-టౌన్ హీరోయిన్లు అలియా భట్, జాన్వీ కపూర్, కియారా అద్వానీలకు రౌడీ మీద బిగ్ క్రష్ ఉందని చెప్పాలి. ఇక ప్రస్తుతం విజయ్ తన తదుపరి చిత్రం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌తో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్యాన్ ఇండియా మూవీగా పూరి తెరకెక్కించనున్నాడు. దానికి అనుగుణంగానే బాలీవుడ్‌ వెర్షన్‌కు నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ప్రజెంట్ చేసేందుకు […]

'ఫైటర్'‌తో రొమాన్స్‌కు జాన్వీ సై..
Ravi Kiran
|

Updated on: Dec 16, 2019 | 2:02 PM

Share

యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండకు తెలుగులోనే కాదు.. బాలీవుడ్‌లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. బీ-టౌన్ హీరోయిన్లు అలియా భట్, జాన్వీ కపూర్, కియారా అద్వానీలకు రౌడీ మీద బిగ్ క్రష్ ఉందని చెప్పాలి. ఇక ప్రస్తుతం విజయ్ తన తదుపరి చిత్రం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌తో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్యాన్ ఇండియా మూవీగా పూరి తెరకెక్కించనున్నాడు. దానికి అనుగుణంగానే బాలీవుడ్‌ వెర్షన్‌కు నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ప్రజెంట్ చేసేందుకు సిద్దమయ్యాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామను ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ మొదటి నుంచి ప్రయత్నం చేస్తూ వచ్చారు. కియారా అద్వానీ, అనన్య పాండే వంటి స్టార్ హీరోయిన్లతో సంప్రదింపులు జరిపారు కూడా. అయితే డేట్స్ ఎడ్జెస్ట్ కాకపోవడం వల్ల అందరూ కూడా నో చెప్పడం జరిగింది.

ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ ఎంపిక అయినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాను జాన్వీ సైన్ చేయడానికి పరోక్షంగా కరణ్ జోహార్ కారణమని బీ-టౌన్ కోడై కూస్తోంది. స్టార్ డాటర్స్ అందరికి కరణ్ జోహార్ ఒక గాడ్ ఫాదర్ లెక్క. జాన్వీ విషయానికి వస్తే.. ఆమె మొదటి సినిమానే కాదు.. తాజాగా నటిస్తున్న సినిమాల్లో ఎంపికలో కూడా కరణ్ జోహార్ ప్రమేయం ఉంది.

అంతేకాకుండా గతంలో జాన్వీ ‘కాఫీ విత్ కరణ్’ షోకి వచ్చినప్పుడు విజయ్ మీద ఉన్న క్రష్‌ను బయటపెట్టింది. ఇలా ఈ రెండు కారణాల చేత జాన్వీ.. విజయ్ సినిమాకు ఓకే చెప్పి ఉండొచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us
ఉప్పు తిన్నవాడు నీళ్లు తాగుతాడు.. ఈ సామెత అర్థం ఏమిటో తెలుసా?
ఉప్పు తిన్నవాడు నీళ్లు తాగుతాడు.. ఈ సామెత అర్థం ఏమిటో తెలుసా?
క్రికెటర్ కాకపోతే బుమ్రా ఏం చేసేవాడో తెలుసా ?
క్రికెటర్ కాకపోతే బుమ్రా ఏం చేసేవాడో తెలుసా ?
ఏపీలో మున్సిపల్ పోరు.. సీట్ల పంపకంలో జనసేన వాటాపై ఆసక్తికర చర్చ!
ఏపీలో మున్సిపల్ పోరు.. సీట్ల పంపకంలో జనసేన వాటాపై ఆసక్తికర చర్చ!
జైలర్ 2లో రజినీకాంత్‏తో సీన్‌.. దెబ్బకు వణికిపోయిన హీరోయిన్..
జైలర్ 2లో రజినీకాంత్‏తో సీన్‌.. దెబ్బకు వణికిపోయిన హీరోయిన్..
భారత పారిశ్రామిక, డిజిటల్‌ విప్లవంలో 'రిలయన్స్' చెరగని ముద్ర
భారత పారిశ్రామిక, డిజిటల్‌ విప్లవంలో 'రిలయన్స్' చెరగని ముద్ర
కరువు మండలాలు ప్రకటించారు.. రైతులకు సాయం దక్కేది అప్పుడేనా..?
కరువు మండలాలు ప్రకటించారు.. రైతులకు సాయం దక్కేది అప్పుడేనా..?
రన్ అవుట్ వివాదంపై మౌనం వీడిన తిలక్ వర్మ
రన్ అవుట్ వివాదంపై మౌనం వీడిన తిలక్ వర్మ
చదువుకు, ఉద్యోగానికి మధ్య పెరుగుతున్న అంతరం.. వాస్తవ కారణాలివే!
చదువుకు, ఉద్యోగానికి మధ్య పెరుగుతున్న అంతరం.. వాస్తవ కారణాలివే!
మార్కెట్లు పడుతున్నా తగ్గని SIP పెట్టుబడులు.. సరికొత్త రికార్డు!
మార్కెట్లు పడుతున్నా తగ్గని SIP పెట్టుబడులు.. సరికొత్త రికార్డు!
హార్వర్డ్‌లో చదవాలన్నది ఆమె కల.. లైబా మృతి!
హార్వర్డ్‌లో చదవాలన్నది ఆమె కల.. లైబా మృతి!