AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ప్రధాని మోదీ నాయకత్వం నచ్చింది, దేశానికి సేవ చేసే ఛాన్స్ వచ్చింది’, బీజేపీలో చేరిన టీవీ రాముడు అరుణ్ గోవిల్ వ్యాఖ్య

ఒకప్పుడు దూరదర్శన్ లో ప్రసారమై కోట్లాది హృదయాలను కొల్లగొట్టిన రామానంద్ సాగర్ సీరియల్ '  రామాయణ్' లో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ గురువారం బీజేపీలో చేరారు.

'ప్రధాని మోదీ నాయకత్వం నచ్చింది,  దేశానికి సేవ చేసే ఛాన్స్ వచ్చింది',  బీజేపీలో చేరిన టీవీ రాముడు అరుణ్ గోవిల్ వ్యాఖ్య
Tv serial Ramayan Actor Arun Govil
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 18, 2021 | 8:15 PM

Share

ఒకప్పుడు దూరదర్శన్ లో ప్రసారమై కోట్లాది హృదయాలను కొల్లగొట్టిన రామానంద్ సాగర్ సీరియల్ ‘  రామాయణ్’ లో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ గురువారం బీజేపీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ ఎంపీ, పార్టీ  జాతీయ ప్రధాన కార్యదర్శి అర్జున్ సింగ్ , ఇతర నేతల సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. మరో 10 రోజుల్లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఆయన పార్టీలో చేరడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ  ఈ దేశ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చివేశారని వ్యాఖ్యానించారు. తనకు ఇదివరకటి రాజకీయ నేతల గురించి పెద్దగా తెలియదని, కానీ  ఈ  దేశానికి కొంతవరకు సేవ చేద్దామనుకున్నానని, ఇందుకు సరైన వేదిక బీజేపీయేనని నిర్ధారణకు వచ్చ్చానని అన్నారు. పాలిటిక్స్ లోకి ఎంటర్ కావాలన్న ఉద్దేశం ఎందుకు కలిగిందన్న ప్రశ్నకు ఆయన.. బెంగాల్ ఎన్నికలేనని సమాధానమిచ్చారు. ఆ రాష్ట్ర సీఎం మమతకు   ‘జైశ్రీరామ్’ అనే నినాదంతో ఎలర్జీ కలిగినదని, అందుకే మొదటిసారిగా రాజకీయాల్లోకి  వచ్చానని కూడా ఆయన చెప్పారు.

2003 వరకు కూడా ఈ సీరియల్ దేశవ్యాప్తంగా ప్రజల హృదయాలను కొల్లగొట్టింది.  పలు తెలుగు, హిందీ, బెంగాలీ,ఒడియా, భోజ్ పురి చిత్రాల్లో కూడా  అరుణ్ గోవిల్ నటించారు. ఇక ఇప్పటికే బీజేపీలో బాలీవుడ్, బెంగాలీ  నటుడు మిథున్ చక్రవర్తి కూడా ఇదివరకే చేరారు.  కాగా- అరుణ్ గోవిల్ కి పార్టీ ఎలాంటి బాధ్యతలను అప్పగిస్తుందో చూడవలసి ఉంది. అయన ను స్టార్ క్యాంపెయినర్ గా వినిగించుకునే సూచనలు ఉన్నాయని అంటున్నారు. మిథున్ చక్రవర్తి  ముఖ్యంగా నందిగ్రామ్ లో బీజేపీ అభ్యర్థి  సువెందు అధికారి తరఫున ప్రచారం చేయనున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి: ‘మనలోని గుణాలనే మరో వ్యక్తిలో చూస్తాం’ ,జోబైడెన్ వ్యాఖ్యలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సెటైర్

కొద్ది క్షణాల్లో ఎంగేజ్మెంట్ అంతలోనే ప్రత్యక్షమైన మాజీ ప్రియురాలు… తర్వాత ఏంజరిగిందంటే తెలుస్తే షాక్ అవుతారు..