కొద్ది క్షణాల్లో ఎంగేజ్మెంట్ అంతలోనే ప్రత్యక్షమైన మాజీ ప్రియురాలు… తర్వాత ఏంజరిగిందంటే తెలుస్తే షాక్ అవుతారు..

ఒక అమ్మాయిని మోసం చేసి మరో అమ్మాయిని వివాహం చేసుకోవడం. లేదంటే అమ్మాయిలను ప్రేమలోకి దింపి పెళ్లి చేసుకోకుండా మోసం చేయడం. ఆ అమ్మాయి ప్రియుడి ఇంటిముందు నిరాహార దీక్షలు చేయడం ఇలాంటి వార్తలు

కొద్ది క్షణాల్లో ఎంగేజ్మెంట్ అంతలోనే ప్రత్యక్షమైన మాజీ ప్రియురాలు... తర్వాత ఏంజరిగిందంటే తెలుస్తే షాక్ అవుతారు..
Engagement
Follow us

|

Updated on: Mar 18, 2021 | 8:00 PM

ఒక అమ్మాయిని మోసం చేసి మరో అమ్మాయిని వివాహం చేసుకోవడం. లేదంటే అమ్మాయిలను ప్రేమలోకి దింపి పెళ్లి చేసుకోకుండా మోసం చేయడం. ఆ అమ్మాయి ప్రియుడి ఇంటిముందు నిరాహార దీక్షలు చేయడం ఇలాంటి వార్తలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ కూడా అదే జరిగింది. చుట్టూ బంధువులు. ఎదురుగా కాబోయే అమ్మాయి. మరికొద్ది క్షణాల్లో నిశ్చితార్ధం ఇంతలోనే ఊహించని సంఘటన. ఏకంగా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యిపోయింది. ఇంతలు ఎం జరిగిందంటే.

సరిగ్గా ఎంగేజ్మెంట్  సమయానికి వేదికపైకి వరుడి మాజీ ప్రియురాలు ప్రత్యక్షం అయ్యింది. దాంతో అతడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి ఢిల్లీ రోడ్‌లోని ఓ హోటల్‌లో జరిగింది. మీరట్ కు చెందిన ఓ యువకుడి పై మొరాదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సరిగ్గా వేరే యువతితో ఎంగేజ్మెంట్పై జరుగుతున్న సమయంలో ఎంట్రీ ఇచ్చి ..తన పై సదరు యువకుడు అత్యాచారం చేసాడని ఆతర్వాత తనను తరిమికొట్టాడని చెప్పి అందరికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఆ వ్యక్తి తనతో చాలా సంవత్సరాలు సంబంధం కలిగి ఉన్నాడని ఆమె ఆరోపించింది. ” వివాహం చేసుకుంటానని చెప్పి సంవత్సరాలుగా  లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఇప్పుడు అతను మరొక స్త్రీని వివాహం చేసుకోవడానికి వచ్చాడు” అని ఆమె తెలిపింది. దాంతో అతడి నిశ్చితార్ధం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇక ఈ వ్యవహారం పోలీస్ఎ స్టేషన్స్పీ వరకు వెళ్ళింది. ఇద్దరినీ పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు  ఐపిసి సెక్షన్ 120 బి (క్రిమినల్ కుట్రకు శిక్ష), 376 (అత్యాచారానికి శిక్ష) మరియు 506 (క్రిమినల్ బెదిరింపులకు శిక్ష) కింద ఆ వ్యక్తితో సహా నలుగురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసారు పోలీసులు. ఇదిలా ఉంటే యువకుడి కుటుంబసభ్యులు కూడా ఆమహిళ పై ఫిర్యాదు చేశారు. ఆమె కావాలనే ఇదంతా చేస్తుందని ఆ యువకుడి తండ్రి ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్ లో ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

‘మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పండి !’ ప్రధాని మోదీకి తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఓబ్రీన్ సూటి ప్రశ్న

Kamal Haasan’s Silambaram Skills : ఓటర్లను ఆకట్టుకోవడానికి కమల్ కర్రసాము.. తండ్రి టాలెంట్‌కు కూతురు ఫిదా..!

Latest Articles