AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపావళికి ముందే కేంద్రం తీపి కబురు.. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ నజరానా!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కరువు భత్యం (DA), కరువు ఉపశమనం (DR)లను 3 శాతం పాయింట్లు పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఉద్యోగుల డీఏ, పింఛనుదారుల డీఆర్‌ 60 శాతం నుంచి 63 శాతానికి పెరగనున్నాయి.

దీపావళికి ముందే కేంద్రం తీపి కబురు.. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ నజరానా!
Da Hike 2026Image Credit source: AI Image
Balaraju Goud
|

Updated on: Oct 28, 2026 | 4:24 PM

Share

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కరువు భత్యం (DA), కరువు ఉపశమనం (DR)లను 3 శాతం పాయింట్లు పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఉద్యోగుల డీఏ, పింఛనుదారుల డీఆర్‌ 60 శాతం నుంచి 63 శాతానికి పెరగనున్నాయి. దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల మంది పింఛనుదారులు ప్రయోజనం పొందనున్నారు.

నెల జీతం ఎంత పెరుగుతుంది?

డీఏ పెంపు ఉద్యోగుల ప్రాథమిక వేతనంపై ఆధారపడి ఉంటుంది. అంటే ప్రాథమిక వేతనంలో 3 శాతం పాయింట్ల మేరకు అదనపు భత్యం లభిస్తుంది. ఉదాహరణకు, రూ.18,000 బేసిక్‌ పే ఉన్న ఉద్యోగికి ప్రస్తుతం 60 శాతం డీఏ ప్రకారం రూ.10,800 లభిస్తోంది. కొత్త రేటు 63 శాతానికి చేరితే ఈ మొత్తం రూ.11,340 అవుతుంది. అంటే నెలకు అదనంగా రూ.540 అందుతుంది. అలాగే, రూ.35,400 ప్రాథమిక వేతనం ఉన్న ఉద్యోగికి నెలకు రూ.1,062 అదనంగా లభిస్తుంది. రూ.50,000 బేసిక్‌ పే ఉన్న ఉద్యోగికి నెలవారీ డీఏ రూ.30,000 నుంచి రూ.31,500కు పెరుగుతుంది. దీంతో నెలకు రూ.1,500 అదనపు ప్రయోజనం కలుగుతుంది.

పింఛనుదారులకు ఊరట!

మోదీ సర్కార్ నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వ పింఛనుదారులకూ ప్రయోజనం కలుగుతుంది. వారి అర్హతగల ప్రాథమిక పింఛనుపై డీఆర్‌ 60 శాతం నుంచి 63 శాతానికి పెరుగుతుంది. దీంతో నెలవారీ పింఛను ఆదాయంలో పెరుగుదల ఉంటుంది.

ప్రభుత్వంపై రూ.10,016 కోట్ల భారం!

డీఏ, డీఆర్‌ పెంపుతో కేంద్ర ప్రభుత్వంపై ఏడాదికి సుమారు రూ.10,016 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనున్నట్లు సమాచారం. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల ప్రభావాన్ని తగ్గించి, ఉద్యోగులు, పింఛనుదారులకు ఆర్థిక ఊరట కల్పించడం ఈ నిర్ణయం ఉద్దేశమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

ఎప్పటి నుంచి అమలు?

సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు జనవరి 1, జూలై 1 తేదీల నుంచి అమలయ్యేలా డీఏ, డీఆర్‌ రేట్లను సవరిస్తుంది. అయితే తాజా పెంపు అమలు తేదీ, బకాయిల చెల్లింపుపై తుది స్పష్టత కోసం అధికారిక ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రాష్ట్రపతి ADC నుంచి ఫ్యాషన్‌ మోడల్‌గా మాజీ మేజర్‌ రిషబ్‌ సింగ్!
రాష్ట్రపతి ADC నుంచి ఫ్యాషన్‌ మోడల్‌గా మాజీ మేజర్‌ రిషబ్‌ సింగ్!
వందల కోట్ల ఆస్తి.. నాలుగు సెకన్లలో పోగొట్టుకున్నా..
వందల కోట్ల ఆస్తి.. నాలుగు సెకన్లలో పోగొట్టుకున్నా..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక.. !
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక.. !
నాన్న మాటే స్ఫూర్తి.. UPSC టాపర్‌ నరేంద్ర పడాల్‌ సక్సెస్ జర్నీ
నాన్న మాటే స్ఫూర్తి.. UPSC టాపర్‌ నరేంద్ర పడాల్‌ సక్సెస్ జర్నీ
30 ఓవర్లకు జింబాబ్వే విలవిల.. 4 వికెట్లతో షాకిచ్చిన వైష్ణవి శర్మ
30 ఓవర్లకు జింబాబ్వే విలవిల.. 4 వికెట్లతో షాకిచ్చిన వైష్ణవి శర్మ
ఏపీలో MPTC, ZPTC ఎన్నికల తేదీలు మార్పు.. పోలింగ్, కౌంటింగ్ తేదీలు ఇవే!
ఏపీలో MPTC, ZPTC ఎన్నికల తేదీలు మార్పు.. పోలింగ్, కౌంటింగ్ తేదీలు ఇవే!
హైదరాబాద్ నుంచి అండమాన్ టూర్ ప్యాకేజీ.. 7 రోజుల్లో ఈ అందమైన దీవుల
హైదరాబాద్ నుంచి అండమాన్ టూర్ ప్యాకేజీ.. 7 రోజుల్లో ఈ అందమైన దీవుల
ఇన్‌స్టాలో రోనాల్డ్ ఫాలో చేసే ఏకైక భారతీయుడు ఎవరో తెలుసా..?
ఇన్‌స్టాలో రోనాల్డ్ ఫాలో చేసే ఏకైక భారతీయుడు ఎవరో తెలుసా..?
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా..? మీకు తెలియని ఈ నిజాలు..
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా..? మీకు తెలియని ఈ నిజాలు..
టోలెడో ప్రావిన్స్‌లో రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ..
టోలెడో ప్రావిన్స్‌లో రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ..