Kondapalli: ‘కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగకపోతే ఎందుకు టీడీపీ నేతల పర్యటనను అడ్డుకుంటున్నారు’

టీడీపీ నిజ నిర్థారణ కమిటీ రేపు కొండపల్లిలో అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్లనున్న నేపథ్యంలో జరుగుతోన్న అరెస్టులపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర తీవ్ర..

Kondapalli: 'కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగకపోతే ఎందుకు టీడీపీ నేతల పర్యటనను అడ్డుకుంటున్నారు'
Kollu Ravindra House Arrest
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 30, 2021 | 9:16 PM

Kollu Ravindra: టీడీపీ నిజ నిర్థారణ కమిటీ రేపు కొండపల్లిలో అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్లనున్న నేపథ్యంలో జరుగుతోన్న అరెస్టులపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరగకపోతే ఎందుకు టీడీపీ నేతల పర్యటనను అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు.

రేపు కొండపల్లి వెళ్లకుండా మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు ఈ సాయంత్రం ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్బంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరును కొల్లు తప్పుబట్టారు. పోలీసులను అడ్డం పెట్టుకుని సీఎం జగన్ పాలన చేస్తున్నారన్నారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ జరుగుతుంది.. అది బయటపడుతుందనే మాజీ మంత్రి దేవినేని ఉమాపై దాడికి దిగారని ఆయన ఆరోపించారు.

దేవినేని ఉమా కారుపై వైసీపీ నాయకులు దాడి చేస్తే తిరిగి దేవినేని ఉమాపై కేసు పెట్టడం ఏంటి..? అని కొల్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కి మైనింగ్ చేసే అవసరం లేదని చిలకపలుకులు పలికిన మంత్రులు మా హౌస్ అరెస్ట్ కి ఏం సమాధానం చెబుతారు? అని ఆయన నిలదీశారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టీడీపీ నాయకుల మైనింగ్ పరిశీలనకు అంగీకరించాలని డిమాండ్ చేసిన కొల్లు రవీంద్ర.. పోలీసులు ఎన్ని నిర్బందాలు పెట్టినా రేపు కొండపల్లి మైనింగ్ ప్రాంతానికి వెళ్లి తీరుతామని తేల్చి చెప్పారు.

Kollu Ravindra

Kollu Ravindra

Read also: TTD Herbal products: దేశీయ గోవుల పంచ‌గ‌వ్యాల‌తో హెర్బల్ ప్రొడక్ట్స్ త‌యారీ వేగవంతం : టీటీడీ ఈవో జవహర్ రెడ్డి