AP YSR Pension: ఆగస్ట్ 1న ఇంటింటికి వైఎన్ఆర్ పెన్షన్.. పంపిణీకి సర్వం సిద్దం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

వైఎస్‌ఆర్‌ పెన్షన్ కానుక కింద లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం సర్వం సిద్దం చేసిందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

AP YSR Pension: ఆగస్ట్ 1న ఇంటింటికి వైఎన్ఆర్ పెన్షన్.. పంపిణీకి సర్వం సిద్దం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
Minister Peddireddy Ramachandra Reddy
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 30, 2021 | 9:29 PM

AP YSR Pension door step: వైఎస్‌ఆర్‌ పెన్షన్ కానుక కింద లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం సర్వం సిద్దం చేసిందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జూలై నెల పెన్షన్ మొత్తాలను ఆగస్ట్ 1వ తేదీన నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దే, వారి చేతికి అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.

వైఎస్‌ఆర్‌ పెన్షన్ కానుక ద్వారా ఆగస్టు ఒకటిన నేరుగా 60,55,377 మంది లబ్ధిదారుల చేతికి అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. వారికి ఇంటి వద్దకే 2.66 లక్షల మంది వాలంటీర్లు వెళ్లి పెన్షన్ డబ్బులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.1455.87 కోట్లు నిధులు విడుదల చేసిందని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. లబ్ధిదారుల బయోమెట్రిక్‌, ఐరిస్‌ విధానాల ద్వారా పక్కాగా అమలు చేస్తున్నామని, ఆర్‌బిఐఎస్‌ విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఈ రెండు విధానాల్లో ఆసలైన పింఛనుదారులు గుర్తింపు సాధ్యం కాకపోతే అంతకుముందే వారి కుటుంబ సభ్యులు నమోదు చేయించుకున్న ఆథరైజ్డ్‌ బయోమెట్రిక్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమాన్ని మూడు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Read Also… 

Cricket: కరోనా నిబంధనలు ఉల్లంఘన.. ముగ్గురు క్రికెట్లర్లపై ఏడాది నిషేధం..