CM KCR -RGV: వారంతా రీల్ స్టార్స్.. ఈయన మాత్రం ప్యాన్‌ ఇండియా రియల్‌ పొలిటికల్‌ స్టార్‌.. కేసీఆర్‌పై ఆర్జీవీ ట్వీట్..

ఆయన మాట్లాడితే ఓ లెవల్‌.. మాట్లాడకపోతే అది మరో లెవల్‌. ఇక్క ట్వీటే కదా అని లైట్‌గా తీసుకుంటే కాంట్రోవర్సీ ఫ్రేమ్‌ తెగుద్ది.. అనే రేంజ్‌లో ట్విట్టర్‌లో తడాఖా చూపిస్తారు. ఎవరికి వాళ్లు తామే రైటనుకుంటారు. కానీ మనోడి రూటే సపరేటు. హీ ఈజ్‌ నన్‌ అదర్‌ దెన్‌ రాంగ్‌ ..గోపాల వర్మ...!! ఎప్పుడూ వివాదాల దారిలో పరుగులు తీసే ఆర్జీవీ.. ఇప్పుడు కొంత రూట్ మార్చారు. సీఎం కేసీఆర్‌ను ప్రశంసలతో తడిపేశారు.

CM KCR -RGV: వారంతా రీల్ స్టార్స్.. ఈయన మాత్రం ప్యాన్‌ ఇండియా రియల్‌ పొలిటికల్‌ స్టార్‌.. కేసీఆర్‌పై ఆర్జీవీ ట్వీట్..
Cm Kcr And Rgv
Sanjay Kasula

|

Sep 27, 2022 | 5:46 PM

ఆర్‌జీవీ అంటేనే కాంట్రవర్సీ, కాంట్రవర్సీ అంటేనే ఆర్‌జీవీ.. అయితే ఈసారి అలా కాదు కొంత డిఫ్రెంట్‌గా ట్వీట్ చేశారు. ఇప్పుడు తెలంగాణలోకి తొంగి చూశారు. తరచూ వివాదాలను పలకరిస్తూండటం ఆయన స్పెషల్.. ఆయనే   సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. అయితే ఏ విషయంపై అయినా వ్యంగ్యంగా స్పందిస్తారు ఆర్జీవీ. తనదైన శైలిలో కామెంట్‌ చేస్తుంటారు. అలా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ, ఏ ఒక్కరిని వదలడు ఆర్జీవీ. ఇప్పుడు తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును టచ్ చేశారు. అలా ఇలా కాదు.. ఏకంగా ఆకాశానికి ఎత్తేశారు. విమర్శలతోకాదు.. ప్రశంసలతో ముంచేశారు దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ.

ఏదో ఒక ట్వీట్‌తో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసే డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ తాజాగా టీఆర్ఎస్, తెలంగాణ సీఎం కేసీఆర్‌ని ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్ 2ను ఫాలో అవుతూ టీఆర్ఎస్ – బీఆర్ఎస్‌గా మారి ప్యాన్‌ ఇండియా విస్తరించాలని ట్వీట్‌లో ఆర్జీవీ ఆకాంక్షించారు. యశ్‌, తారక్‌, ప్రభాస్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ రీల్‌ స్టార్స్‌ని ప్యాన్‌ ఇండియా రియల్‌ పొలిటికల్‌ స్టార్‌ కేసీఆర్ అని ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు. అలా ఆయన ట్వీట్‌ చేశారో లేదో దానికి గంట వ్యవధిలోనే వేలల్లో లైక్స్‌ వచ్చాయి. వందల సార్లు అది రీట్వీట్‌ అవుతోంది.

ఇదిలావుంటే..  జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటు చేసేందుకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లాన్ రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన దసరాకు పార్టీ ప్రకటన చేయనున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఇందులో చిన్న మార్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. దసరా నుంచి ఈ ఏడాది చివరికి చేరినట్లుగా సమాచారం. అంటే డిసెంబర్‌లో కేసీఆర్ కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉంది.

టీఆర్‌ఎస్‌తో దోస్తీకి ప్రశాంత్ కిశోర్ కటీఫ్ చెప్పినట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాలపై గతంలో కేసీఆర్‌తో వరుసగా భేటీ అయిన ప్రశాంత్ కిషోర్.. కొద్ది రోజులుగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. జాతీయ స్థాయిలో టీఆర్‌ఎస్‌తో కలిసి పని చేసేందుకు ఆయన విముఖత చూపినట్లు తెలుస్తుంది. రాష్ట్రం వరకే పనిచేస్తామని ఐప్యాక్‌ చెప్పినట్లు సమాచారం. కానీ రాష్ట్ర స్థాయిలో సేవలపై టీఆర్‌ఎస్ ఆసక్తి కనబరచడం లేదు. కాంగ్రెస్‌తో కలిసిన బీజేపీ వ్యతిరేక కూటమి కోసం ప్రశాంత్ కిషోర్ జాతీయ స్థాయిలో పనిచేసేందుకు పీకే సిద్ధమైనట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu