Peddi Reddy on Etela : నన్ను కాదని పార్టీలోకి ఎలా తీసుకుంటారు? ఈటల బిజెపిలోకి వస్తే మరో ఉప్పెన తప్పదు : పెద్దిరెడ్డి
Peddi Reddy hot comments on Etela : టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, బహిష్కృత మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరబోతున్నట్టు వస్తోన్న వార్తలపై మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి తీవ్ర..

Enugala Peddi Reddy hot comments on Etela : టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, బహిష్కృత మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరబోతున్నట్టు వస్తోన్న వార్తలపై మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ బిజెపిలోకి వస్తే మరో ఉప్పెన తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. “నన్ను సంప్రదించకుండా ఈటెల రాజేందర్‌ను ఎట్లా బీజేపీ లోకి తీసుకుంటారు.? ఒక్క వర్గం వ్యక్తులు మాత్రమే ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఆయనతో సంప్రదింపులు జరిపిన సమయంలో ఒక్కసారి కూడా నన్ను అడగకపోవడం శోచనీయం.” అని పెద్దిరెడ్డి అన్నారు. “ఢిల్లీ నుండి స్పెషల్ ఫ్లయిట్ లో వచ్చిన నాయకులకు నాకు చెప్పడానికి ఏంటి బాధ.? హైదరాబాద్ లోని వివేక్ ఫామ్ హౌస్ లో చర్చలు జరిపితే కూడా నేను గుర్తు లేదా … నన్ను కాదని ఈటలను పార్టీ లోకి ఎలా తీసుకుంటారు. స్థానిక ప్రతినిధిని అయిన నన్ను సంప్రదించకుండా ఎలా ముందుకు వెళతారు.” అంటూ పెద్దిరెడ్డి బీజేపీ పెద్దల్ని ప్రశ్నించారు. అదే సమయంలో ఈటలను బీజేపీలోకి తీసుకోవడం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
Read also : Covid situation review : మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ భేటీ.. పలు కీలక అంశాలపై నిర్ణయాలు