AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cash for vote scam : ఓటుకు నోటు కేసులో ఈడీ చార్జ్ షీట్.. ప్రధాన నిందితుడుగా రేవంత్.. కనిపించని చంద్రబాబు పేరు.!

ED files chargesheet against MP Revanth Reddy : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఈడీ ఇవాళ చార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే, అనూహ్యంగా..

Cash for vote scam : ఓటుకు నోటు కేసులో ఈడీ చార్జ్ షీట్.. ప్రధాన నిందితుడుగా రేవంత్.. కనిపించని చంద్రబాబు పేరు.!
Vote For Note Case
Venkata Narayana
|

Updated on: May 27, 2021 | 7:09 PM

Share

ED files chargesheet against MP Revanth Reddy : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఈడీ ఇవాళ చార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే, అనూహ్యంగా ఈ చార్జ్ షీట్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేరు లేకపోవడం విశేషం. ఈ చార్జీషీట్‌లో ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా ఈడీ పేర్కొంది. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌రెడ్డి 50 లక్షలు ఇచ్చినట్టు చార్జ్‌షీట్‌లో రాశారు. తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ చేసే విధంగా.. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రాయబారం నడిపినట్టుగా రేవంత్‌రెడ్డిపై చార్జ్‌షీట్‌లో అభియోగాలు మోపారు. ఛార్జీషీట్‌లో రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, అతని కుమారుడు వేం కృష్ణ, కీర్తన రెడ్డి, సెబాస్టియన్‌ల పేర్లను పొందుపరిచారు. ఇలా ఉండగా, 2015 మే 21న స్టీఫెన్ సన్‌కు 50 లక్షల రూపాయలు లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా రేవంత్ రెడ్డి పట్టుపడ్డారు. ఈ కేసులో చంద్రబాబు పేరును కూడా చేర్చారు. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు ఆడియో వాయిస్ అంటూ అప్పట్లో సంచలనమైంది. “మన వాళ్లు బ్రీఫ్డ్ మీ…” అంటూ వినిపించిన ఆ మాటలు టీడీపీని ఒక కుదుపుకుదిపాయి.

కాగా, అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా… టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసేందుకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురిచేశారన్నది రేవంత్ రెడ్డి తదితరులపై ఉన్న ప్రధాన అభియోగం. కాగా, ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పాత్రపైనా ఏసీబీ విచారిస్తోంది. ఆయన స్టీఫెన్ సన్ తో మాట్లాడినట్టుగా భావిస్తున్న ఆడియో టేప్ ను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపడం తెలిసిందే. అప్ప‌ట్లో వీడియో ఆధారాలు బట్టబయలు కాగా, రేవంత్ రెడ్డి కొంతకాలం జైలులో కూడా ఉన్నారు. బెయిల్ పై బయటికి వచ్చిన ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు.

Read also : Covid situation review : మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ భేటీ.. పలు కీలక అంశాలపై నిర్ణయాలు