టీడీపీ కంచుకోటకు బీటలు…!

క్రిష్ణాజిల్లా టీడీపీలో జంపింగ్ జపాంగ్ కలకలం రేపుతోంది. టీడీపీ కంచుకోట బీటలు వారుతోంది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి రోజు రోజుకీ క్షీణిస్తుండటంతో కీలక నేతలు పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఓటమినుంచి తేరుకొని ముందుకు వెళ్ళాలని అధిష్టానం ప్రయత్నిస్తుంటే.. ఓడిన నేతలూ.. గెలిచిన ఎమ్మెల్యే కూడా సైకిల్ దిగడానికి సిద్ధమౌతున్నట్లు వస్తున్న ప్రచారం పార్టీలో గుబులు రేపుతోంది. దేవినేని ఫ్యామిలీకి రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు, జిల్లాలో మంచి పట్టు ఉన్నాయి. అయితే ఎన్నికల్లో ఓటమి పాలైన […]

టీడీపీ కంచుకోటకు బీటలు...!
Follow us

| Edited By:

Updated on: Aug 06, 2019 | 6:11 PM

క్రిష్ణాజిల్లా టీడీపీలో జంపింగ్ జపాంగ్ కలకలం రేపుతోంది. టీడీపీ కంచుకోట బీటలు వారుతోంది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి రోజు రోజుకీ క్షీణిస్తుండటంతో కీలక నేతలు పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఓటమినుంచి తేరుకొని ముందుకు వెళ్ళాలని అధిష్టానం ప్రయత్నిస్తుంటే.. ఓడిన నేతలూ.. గెలిచిన ఎమ్మెల్యే కూడా సైకిల్ దిగడానికి సిద్ధమౌతున్నట్లు వస్తున్న ప్రచారం పార్టీలో గుబులు రేపుతోంది.

దేవినేని ఫ్యామిలీకి రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు, జిల్లాలో మంచి పట్టు ఉన్నాయి. అయితే ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు అవినాష్. టీడీపీలో రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారడంతో వైసీపీ గూటికి చేరడానికి రెడీ అవుతున్నారని సమాచారం. విజయవాడలో వైసీపీ అభ్యర్ధి బొప్పన భవ్య ప్రసాద్, యలమంచిలి రవికి మధ్య విభేదాలు ఉండటంతో తూర్పు నియోజకవర్గాన్ని అవినాష్ కి అప్పగించవచ్చనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారాన్ని అవినాష్ ఖండించకపోవడంతో ఆయన ఏ క్షణంలోనైనా సైకిల్ దిగిపోవచ్చని పసుపు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరోవైపు వైసీపీ అభ్యర్ధి మల్లాది విష్ణు చేతిలో స్వల్స తేడాతో ఓడిపోయిన బోండా ఉమ కూడా పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. కేశినేని నానితో బోండా ఉమ సన్నిహితంగా ఉంటున్నారు. పార్టీ ఓటమి నాటినుంచి కేశినేని బీజేపీలో చేరతారనే ప్రచారం సాగుతూనే ఉంది. ఇటు సుజనాచౌదరికి టచ్ లో ఉండటంతో ఉమ కూడా సైకిల్ దిగడం ఖాయమని రాజకీయ చర్చలు సాగుతున్నాయి.

జిల్లాలో టీడీపీకి మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరైన వల్లభనేని వంశీ మాత్రం ఆయన పార్టీ మారబోతున్నారన్న ప్రచారాన్ని ఖండిస్తున్నారు. అయితే వంశీ ఆప్త మిత్రుడైన కొడాలి నాని వంశీని ఎలాగైనా వైసీపీలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు జిల్లా రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. దాంతో ఈ జంపింగ్ జంపాంగ్ ప్రచారాలు క్రిష్ణాజిల్లా టీడీపీలో తీవ్ర కలవరం రేపుతున్నాయి.