AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లోక్ సభలో కాంగ్రెస్ నేత ‘ సెల్ఫ్ డబ్బా.. ‘ సోనియా, రాహుల్ ఇరకాటం

జమ్మూ కాశ్మీర్ పై ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మీద మంగళవారం లోక్ సభలో చర్చ జరుగుతుండగా కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ‘ సెల్ఫ్ డబ్బా ‘ యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలను ఇరకాటంలో పడేసింది. అతని ‘ నోటి దురుసుతనం ‘ వారిని తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. జమ్మూ కాశ్మీర్ దేశ అంతర్గత వ్యవహారం కాదని ఆయన చేసిన వ్యాఖ్యలతో సభలో […]

లోక్ సభలో కాంగ్రెస్ నేత ' సెల్ఫ్ డబ్బా.. ' సోనియా, రాహుల్ ఇరకాటం
Pardhasaradhi Peri
|

Updated on: Aug 06, 2019 | 4:41 PM

Share

జమ్మూ కాశ్మీర్ పై ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మీద మంగళవారం లోక్ సభలో చర్చ జరుగుతుండగా కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ‘ సెల్ఫ్ డబ్బా ‘ యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలను ఇరకాటంలో పడేసింది. అతని ‘ నోటి దురుసుతనం ‘ వారిని తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. జమ్మూ కాశ్మీర్ దేశ అంతర్గత వ్యవహారం కాదని ఆయన చేసిన వ్యాఖ్యలతో సభలో కాంగ్రెస్ దిక్కుతోచని స్థితిలో పడింది. కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 ఆర్టికల్ రద్దు గురించి, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన వైనం గురించి మొదట హోం మంత్రి అమిత్ షా ఓ ప్రకటన చేశారు. దీనిపై సభలో హాట్ హాట్ గా చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరికి, అమిత్ షాకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అసలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) పై ప్రభుత్వ వైఖరి ఏమిటని చౌదరి ప్రశ్నించారు. 1994 లో… నాటి పార్లమెంటు మొత్తం జమ్మూ కాశ్మీర్ అంతా భారత అంతర్భాగమని తీర్మానం చేసి ఆమోదించిందని, ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేయడం ద్వారా ప్రభుత్వం అన్ని నిబంధనలనూ గాలికి వదిలేసిందని ఆయన ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన అమిత్ షా.. జనరల్ స్టేట్ మెంట్లు చేయరాదని అన్నారు. ఇది దేశానికి సంబంధించి పెద్ద సమస్య.. ఏ నిబంధనలు అతిక్రమించామో చెప్పండి..’ అని ఆయన సవాల్ చేశారు. వాటికి తాను సమాధానం చెబుతానన్నారు.

కాగా-చౌదరి అంతటితో ఊరుకోలేదు. కాశ్మీర్ అంతర్గత సమస్య అయితే ఐక్యరాజ్యసమితి ఎందుకు మానిటర్ చేస్తోందో ప్రభుత్వం నుంచి తాను వివరణ కోరుతున్నానన్నారు. పీఓకే గురించి మీరు ఆలోచిస్తున్నట్టు నాకు అనిపించడం లేదు. మీరు అన్ని నిబంధనలు, చట్టాలనూ ఉల్లంఘించి ఒక్క రాత్రిలో కాశ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేశారు ‘ అని ఆయన దుయ్యబట్టారు. ఇక్కడితో ఆగలేదాయన. 1948 నుంచి ఐక్యరాజ్యసమితి ఈ అంశాన్ని పర్యవేక్షిస్తోందని, ఇది అంతర్గత వ్యవహారమా అని ప్రశ్నిస్తూ.. సిమ్లా ఒప్పందాన్ని, లాహోర్ డిక్లరేషన్ గురించి ప్రస్తావించారు. ఇది అంతర్గతమా ? ద్వైపాక్షికమా ? కాశ్మీర్ ఇంకా అంతర్గత సమస్యేనా > నేను తెలుసుకోగోరుతున్నా… మీరు సరిగ్గా చెబితే మా కాంగ్రెస్ పార్టీ అంతా హర్షిస్తుంది ‘ అంటూ తానే కాంగ్రెస్ అధినేత అయినట్టు అధిర్ రంజన్ చౌదరి తన నోటికి పెద్ద ఎత్తున పని చెప్పారు. ఇందుకు మళ్ళీ ఆగ్రహం వ్యక్తం చేసిన అమిత్ షా.. మీరేం మాట్లాడుతున్నారు ? జమ్మూ కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగమే.. పీఓఏకే ఈ రాష్ట్రం కిందకు రాదని మీరు భావిస్తున్నట్టున్నారు.. దానికోసం మేం ప్రాణాలైనా అర్పిస్తాం . అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. కాశ్మీర్ ముమ్మాటికీ ఇండియాలో భాగమేనని, ఆ రాష్ట్రాన్ని ఈ దేశం నుంచి ఎవరూ విడదీయలేరని, ఇందులో సందేహానికి ఆస్కారమే లేదని షా పేర్కొన్నారు. అనంతరం చౌదరి.. తాను అపోహ పడ్డానని, బహుశా సందర్భాన్ని మించి మాట్లాడానని కాస్త తప్పు దిద్దుకున్నట్టు నాలుక సవరించుకున్నారు.