డోంట్ వర్రీ..‘పీఓకే’నూ కూడా సెట్ చేస్తాం!..అఫ్రిదీకి గంభీర్‌ కౌంటర్

ఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన అంశంపై పాకిస్థాన్ తీవ్ర రాద్దాంతం చేస్తున్న సంగతి  తెలిసిందే. ఇప్పటికే దీనిపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంతర్జాతీయ సమాజానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. తాజాగా పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిదీ భారత్ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘ఐరాస తీర్మానం ప్రకారం.. మనందరిలాగే కశ్మీరీ ప్రజలకు ప్రాథమిక హక్కులను ఇవ్వాల్సిందే. అసలు ఐరాస ఎందుకుంది? ఇప్పుడెందుకు నిద్రపోతోంది? మానవత్వానికి […]

డోంట్ వర్రీ..‘పీఓకే'నూ కూడా సెట్ చేస్తాం!..అఫ్రిదీకి  గంభీర్‌ కౌంటర్
Follow us

|

Updated on: Aug 06, 2019 | 2:49 PM

ఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన అంశంపై పాకిస్థాన్ తీవ్ర రాద్దాంతం చేస్తున్న సంగతి  తెలిసిందే. ఇప్పటికే దీనిపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంతర్జాతీయ సమాజానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. తాజాగా పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిదీ భారత్ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘ఐరాస తీర్మానం ప్రకారం.. మనందరిలాగే కశ్మీరీ ప్రజలకు ప్రాథమిక హక్కులను ఇవ్వాల్సిందే. అసలు ఐరాస ఎందుకుంది? ఇప్పుడెందుకు నిద్రపోతోంది? మానవత్వానికి వ్యతిరేకంగా కశ్మీర్‌లో నేరాలు, స్వయం ప్రతిఘటనలు జరుగుతున్న విషయాన్ని గుర్తించాలి. అమెరికా అధినేత ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి’ అని కాస్త ఎక్కువగానే మాటలు తూలాడు.

ఇందుకు భారత మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ కౌంటరిచ్చాడు. ‘అఫ్రిదీ ఎప్పుడూ చురుగ్గా ఉంటాడు. ఈ విషయాన్ని తెలిపినందుకు అతడిని అభినందించాలి. అయితే అఫ్రిదీ ఒక చిన్న విషయాన్ని మర్చిపోయాడు. ఇవన్నీ జరుగుతోంది పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోనే. కాబట్టి ఆందోళన చెందకు. త్వరలోనే అక్కడి పరిస్థితులను కూడా సరిచేస్తాం’ అని తనదైన శైలిలో జవాబిచ్చాడు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..