చారిత్రక తప్పిదాన్ని సరిచేశారు: గల్లా జయదేవ్

ఆర్టికల్ 370 రద్దు విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజలకు మేలు చేస్తుందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. లోక్ సభలో మంగళవారం జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన.. ఒకే దేశం-ఒకే రాజ్యాంగం నినాదానికి టీడీపీ మద్దతు ఇస్తుందని తెలిపారు. 70 ఏళ్ల క్రితం జరిగిన చారిత్రక తప్పిదాన్ని కేంద్ర ప్రభుత్వం సరిచేసిందని ఆయన చెప్పారు. ప్రత్యేక ప్రతిపత్తిని కశ్మీర్‌లో దుర్వినియోగం చేశారని అన్నారు. అంతేకాదు దీనివల్ల ఆడవారు తాము ఎవరిని పెళ్లి చేసుకోవాలో వారే […]

చారిత్రక తప్పిదాన్ని సరిచేశారు: గల్లా జయదేవ్
Follow us

| Edited By:

Updated on: Aug 06, 2019 | 5:19 PM

ఆర్టికల్ 370 రద్దు విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజలకు మేలు చేస్తుందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. లోక్ సభలో మంగళవారం జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన.. ఒకే దేశం-ఒకే రాజ్యాంగం నినాదానికి టీడీపీ మద్దతు ఇస్తుందని తెలిపారు. 70 ఏళ్ల క్రితం జరిగిన చారిత్రక తప్పిదాన్ని కేంద్ర ప్రభుత్వం సరిచేసిందని ఆయన చెప్పారు. ప్రత్యేక ప్రతిపత్తిని కశ్మీర్‌లో దుర్వినియోగం చేశారని అన్నారు. అంతేకాదు దీనివల్ల ఆడవారు తాము ఎవరిని పెళ్లి చేసుకోవాలో వారే నిర్ణయించుకునే అవకాశం ఏర్పడిందన్నారు. కశ్మీర్ విభజనతో రెండు ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని గల్లా జయదేవ్ చెప్పారు. ఇక నైనా జమ్ముకశ్మీర్ అభివృద్ధి చెందుతుందని తాను ఆశిస్తున్నానని ఆయన అన్నారు.