కాలేజ్‌లో గ్యాంగ్ వార్.. స్టూడెంట్ దారుణ హత్య..!
తిరుపతిలోని చదలవాడ డిగ్రీ కాలేజీలో దారుణం జరిగింది. విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. కాలేజీలో గొడవల కారణంగా తోటి విద్యార్థులే డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న ద్వారకానాథ్ పై దాడి చేసి చంపేశారు. మాట్లాడాలని పిలిపించి అతడిపై బీరు బాటిల్‌తో దాడి చేసి.. కత్తులతో మెడపై పొడిచి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థుల మధ్య గ్రూప్ తగాదాల కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు కడప […]
తిరుపతిలోని చదలవాడ డిగ్రీ కాలేజీలో దారుణం జరిగింది. విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. కాలేజీలో గొడవల కారణంగా తోటి విద్యార్థులే డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న ద్వారకానాథ్ పై దాడి చేసి చంపేశారు. మాట్లాడాలని పిలిపించి అతడిపై బీరు బాటిల్‌తో దాడి చేసి.. కత్తులతో మెడపై పొడిచి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థుల మధ్య గ్రూప్ తగాదాల కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు కడప జిల్లా రైల్వేకోడురు చెందిన వాడుగా గుర్తించారు. ద్వారకానాథ్ తల్లిదండ్రులు కువైట్‌లో ఉంటుండగా.. ఏడాదిన్నర క్రితం డిగ్రీ చదివేందుకు అతడు తిరుపతికి వచ్చాడు. అయితే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.