మరోసారి పోలీసుల అదుపులో బాలాజీ

సామాన్యులనే కాదు.. పెద్దవాళ్లను, పలుకుబడి ఉన్నవాళ్లను కూడా బురిడీ కొట్టించడంలో పీహెచ్‌డీ చేసిన బాలాజీ నాయుడు మళ్లీ అరెస్టయ్యాడు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన తోట బాలాజీ పలువురికి మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడటంలో దిట్ట. ఇలా మోసాలకు పాల్పడి గతంలో అరెస్టయ్యాడు. అయినప్పటికీ బుద్ధి మాత్రం మారలేదు. ఇతడిపై ఏపీలోనే కాకుండా తెలంగాణలో కూడా పలు కేసులు నమోదయ్యాయి. అయితే తెలంగాణ సెక్రెటేరియట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని , తాను అక్కడే పనిచేస్తున్నానని నమ్మబలికాడు. ప్రధానమంత్రి జనరేషన్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:32 pm, Mon, 5 August 19
మరోసారి పోలీసుల అదుపులో బాలాజీ

సామాన్యులనే కాదు.. పెద్దవాళ్లను, పలుకుబడి ఉన్నవాళ్లను కూడా బురిడీ కొట్టించడంలో పీహెచ్‌డీ చేసిన బాలాజీ నాయుడు మళ్లీ అరెస్టయ్యాడు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన తోట బాలాజీ పలువురికి మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడటంలో దిట్ట. ఇలా మోసాలకు పాల్పడి గతంలో అరెస్టయ్యాడు. అయినప్పటికీ బుద్ధి మాత్రం మారలేదు. ఇతడిపై ఏపీలోనే కాకుండా తెలంగాణలో కూడా పలు కేసులు నమోదయ్యాయి. అయితే తెలంగాణ సెక్రెటేరియట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని , తాను అక్కడే పనిచేస్తున్నానని నమ్మబలికాడు. ప్రధానమంత్రి జనరేషన్ స్కీం పేరుతో మోసాలకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు.

ప్రభుత్వం తరపున బీసీ,ఎస్సీ,ఎస్టీలకు రుణాలు మంజూరు చేయిస్తానని అందుకోసం 5 శాతం అడ్వాన్స్ ఇవ్వాలని మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేసినట్టుగా బాలాజీపై ఆరోపణలున్నాయి. గతంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డిని బురిడీ కొట్టించబోయి పోలీసులకు చిక్కాడు. తాజాగా మరోసారి బాలాజీని అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు.