AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Butchaiah Chowdary: రాజీనామా వార్తలపై తన మనసులో మాట బయట పెట్టిన బుచ్చయ్య చౌదరి

పార్టీ మనుగడ కోసమే తన పోరాటమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. నా నిర్ణయాన్ని

Butchaiah Chowdary:  రాజీనామా వార్తలపై తన మనసులో మాట బయట పెట్టిన బుచ్చయ్య చౌదరి
Gorantla Butchaiah Chowdary
Venkata Narayana
|

Updated on: Aug 19, 2021 | 6:56 PM

Share

Gorantla Butchaiah chowdary – TDP: పార్టీ మనుగడ కోసమే తన పోరాటమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. నా నిర్ణయాన్ని త్వరలోనే బహిరంగంగా త్వరలో తెలియజేస్తా.. అని ఆయన వెల్లడించారు. నేను ఒంటరి వాడిని అంటూ ఉద్వేగభరితంగా మాట్లాడిన బుచ్చయ్య చౌదరి.. స్థానిక అంశాలు ఏమీ కాదు.. సిద్ధాంత పరమమైన లోపాలపై ఆసంతృప్తితో ఉన్నాను అని టీవీ9 ముందు క్లారిటీ ఇచ్చారు.

“చంద్రబాబుని కలవడానికి నేను వెళ్ళాను..  మా నేతలు వెళ్లి మాట్లాడతారు.. నా నిర్ణయాన్ని బహిరంగంగానే త్వరలో తెలియజేస్తాను ఇప్పుడు ఏమి మాట్లాడలేను పార్టీ మనుగడ కోసమే నా పోరాటం” అని బుచ్చయ్య తెలిపారు. ఇలా ఉండగా, సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి రాజీనామా వార్తలపై టీవీ9 తో మాజీ హోం మంత్రి, టీడీపీ సీనియర్ నేత చిన రాజప్ప మాట్లాడారు. బుచ్చయ్య పార్టీకి రాజీనామా చేస్తారనేది అబద్ధమని రాజప్ప తేల్చారు.

“ఆయన సీనియర్ నాయకుడు. లోకల్‌గా ఆయనకు ఎదో ఇబ్బంది ఉందని తెలిసింది. బుచ్చయ్య ఏది ఉన్నా ముఖంపైనే మాట్లాడే తత్వం ఆయనది. రెండు, మూడు రోజుల్లో అధినేత చంద్రబాబును బుచ్చయ్యతో కలిసి వెళ్లి కలిసి చర్చిస్తాము. చిన్న చిన్న సమస్యలు పార్టీ లో ఉంటాయి. త్వరలో వైసీపీ నుండి వలసలు మొదలవుతాయి. మళ్ళీ టీడీపీలోకి నేతలు తిరిగి చేరతారు.” అంటూ బుచ్చయ్య చౌదరి భవిష్యత్ చెప్పుకొచ్చారు.

Read also: Cyber Crime: సైబర్ నేరాలపై ప్రత్యేక వ్యవస్థ.. ఆన్‌లైన్లో ఫిర్యాదు చేసెయ్యండిలా..!