చంద్రబాబుపై కక్ష తీర్చుకోవడానికే.. ప్రజలు అధికారమిచ్చారా..?

ఇప్పుడు నేతలంతా మీడియా పాయింట్లు పెట్టి.. నేతలను విమర్శించడం మానేశారు. ట్విట్టర్‌లోనే ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌ రెడ్డిపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ అధికారంలోకి వచ్చినకానప్పటినుంచీ చంద్రబాబునే టార్గెట్‌ చేశారని ఆరోపించారు. సీఎం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. ఇప్పటికైనా కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని చెప్పారు. గత ప్రభుత్వం ఏం చేసిందో.. వాటిని ఎలా బయటికి తీయాలో.. వారికి దానిపైనే ఎక్కువగా […]

చంద్రబాబుపై కక్ష తీర్చుకోవడానికే.. ప్రజలు అధికారమిచ్చారా..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 30, 2019 | 5:36 PM

ఇప్పుడు నేతలంతా మీడియా పాయింట్లు పెట్టి.. నేతలను విమర్శించడం మానేశారు. ట్విట్టర్‌లోనే ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌ రెడ్డిపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ అధికారంలోకి వచ్చినకానప్పటినుంచీ చంద్రబాబునే టార్గెట్‌ చేశారని ఆరోపించారు. సీఎం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. ఇప్పటికైనా కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని చెప్పారు. గత ప్రభుత్వం ఏం చేసిందో.. వాటిని ఎలా బయటికి తీయాలో.. వారికి దానిపైనే ఎక్కువగా కాన్సన్‌ట్రేషన్ అన్నారు. జైలు కెళ్లినా.. మీరు అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని సీఎం జగన్‌పై వర్ల రామయ్య ట్వీట్ చేశారు.