చిప్పకూడు తిన్నా బుద్ది రాలేదా.. బుద్దా ట్వీట్

ఏపీలో అధికార విపక్షాల మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. “తండ్రి శవం పక్కనే ఉండగా జగన్ సీఎం చేయడానికి .. శవరాజకీయం చేసిన మీరా పాలన గురించి మాట్లాడేది వీసారెడ్డి గారు” అంటూ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. దొంగలెక్కల కేసుల్లో 16 నెలలపాటు జైల్లో చిప్పకూడు తిన్నాఇంగితం రాలేదని విమర్శించారు. మీ పబ్బం గడుపుకోడానికి అందరి కాళ్లపై పడటంలో పీహెచ్‌డీ చేశారు కదా ! […]

చిప్పకూడు తిన్నా బుద్ది రాలేదా..  బుద్దా ట్వీట్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 30, 2019 | 2:17 PM

ఏపీలో అధికార విపక్షాల మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. “తండ్రి శవం పక్కనే ఉండగా జగన్ సీఎం చేయడానికి .. శవరాజకీయం చేసిన మీరా పాలన గురించి మాట్లాడేది వీసారెడ్డి గారు” అంటూ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. దొంగలెక్కల కేసుల్లో 16 నెలలపాటు జైల్లో చిప్పకూడు తిన్నాఇంగితం రాలేదని విమర్శించారు. మీ పబ్బం గడుపుకోడానికి అందరి కాళ్లపై పడటంలో పీహెచ్‌డీ చేశారు కదా ! అంటూ ట్వీట్ చేశారు. బందరు పోర్టుపై జారీ చేసిన రహస్య జీవో మాటేంటీ? అని బుద్దా ఓ రేంజ్‌లో ఆరోపణలు చేశారు.