AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mylavaram: ‘రైతు కోసం తెలుగుదేశం’.. దేవినేని ఆధ్వర్యంలో నామినేషన్ల పర్వాన్ని తలపించిన ర్యాలీ

'రైతు కోసం తెలుగుదేశం' కార్యక్రమంలో భాగంగా మైలవరంలో భారీ ర్యాలీ నిర్వహించారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు.

Mylavaram: 'రైతు కోసం తెలుగుదేశం'.. దేవినేని ఆధ్వర్యంలో నామినేషన్ల పర్వాన్ని తలపించిన ర్యాలీ
Devineni Uma
Ram Naramaneni
|

Updated on: Oct 01, 2021 | 8:32 AM

Share

‘రైతు కోసం తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా మైలవరంలో భారీ ర్యాలీ నిర్వహించారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు. సూరిబాబు పార్క్ నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు టీడీపీ చేపట్టిన ర్యాలీలో భారీ ఎత్తున కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ఎన్నికల నామినేషన్ల పర్వాన్ని తలపించేలా ర్యాలీ జరగడంతో.. టీడీపీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. భారీ ఎత్తున నిర్వహించిన ఈ ర్యాలీ.. మైలవరం ప్రథాన రహదారుల గుండా కొనసాగింది. ర్యాలీ కొనసాగుతున్నంతా సేపు.. కాసేపు ట్రాఫిక్ స్తంభించింది. టీడీపీ పిలుపు మేరకు ‘నేను సైతం‌-రైతు కోసం’ పేరిట కృష్ణా, గుంటూరు జిల్లాల రైతు సమస్యలపై భారీ ర్యాలీలు చేపట్టారు. రెండు జిల్లాల్లోని ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులు కదం తొక్కి ర్యాలీలో పాల్గొన్నాయి.

రైతు కోసం తెలుగుదేశం అంటూ టీడీపీ చేపట్టిన కార్యక్రమం కృష్ణా జిల్లాలో కొనసాగింది. రాష్ట్ర రైతాంగ సమస్యల పైన వ్యవసాయ మోటార్లకు మీటర్లను బిగించడం, ఎలాంటి భరోసా అందని కౌలు రైతుల పరిస్థితి, రాష్ట్రంలో పండించిన పంటకు కనీస మద్దతు ధర లేకపోవడం, రైతన్నలు నష్టాల బారిన పడటం, ఇక రైతు భరోసా సగం మందికి మాత్రమే అందుతున్న తీరు, పోలవరం సహా పడకేసిన సాగునీటి ప్రాజెక్టులు, రైతుల ఆత్మహత్యలపై పోరాటం చేస్తోంది టీడీపీ.

Also Read: ధోని ఖాతాలో మరో అరుదైన రికార్డ్.. ‘తలా’నా మజాకా.. ప్రశంసల జల్లు

సరైన రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు లేకుండానే వాహనాలు నడుపుతున్నారా..? అయితే మీకో షాకింగ్ న్యూస్