విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని గెలుపు

తెల్లవార్లూ ఉత్కంఠ రేపిన విజయవాడ ఎంపీ సీటు ఫలితం చివరికి టీడీపీకి అనుకూలంగా తేలింది. విజయవాడ ఎంపీగా టీడీపీకి చెందిన కేశినేని నాని విజయం సాధించినట్లు ప్రకటించారు. వైసీపీకి చెందిన పొట్లూరి వరప్రసాద్‌పై 8726 ఓట్లతో గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. 28 రౌండ్ల కౌంటింగ్ పూర్తయిన తర్వాత వివాదం తలెత్తడంతో రీకౌంటింగ్ నిర్వహించాలని పీవీపీ డిమాండ్ చేశారు. దీంతో తెల్లవార్లూ టెన్షన్ ఏర్పడింది. వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించిన తర్వాత ఫలితం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చింది. కేశినేని […]

విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని గెలుపు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 24, 2019 | 8:03 AM

తెల్లవార్లూ ఉత్కంఠ రేపిన విజయవాడ ఎంపీ సీటు ఫలితం చివరికి టీడీపీకి అనుకూలంగా తేలింది. విజయవాడ ఎంపీగా టీడీపీకి చెందిన కేశినేని నాని విజయం సాధించినట్లు ప్రకటించారు. వైసీపీకి చెందిన పొట్లూరి వరప్రసాద్‌పై 8726 ఓట్లతో గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. 28 రౌండ్ల కౌంటింగ్ పూర్తయిన తర్వాత వివాదం తలెత్తడంతో రీకౌంటింగ్ నిర్వహించాలని పీవీపీ డిమాండ్ చేశారు. దీంతో తెల్లవార్లూ టెన్షన్ ఏర్పడింది. వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించిన తర్వాత ఫలితం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చింది. కేశినేని నాని విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు.