సిక్కోలు సీటు మళ్లీ రామ్మోహన్‌దే….

శ్రీకాకుళం పార్లమెంట్ ఫలితంపై తెల్లవారుజాము వరకు హైడ్రామా నడిచింది. ఇక్కడి ఫలితంపై రీకౌంటింగ్ నిర్వహించాలని వైసీపీ అభ్యర్థి డిమాండ్ చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. ఈవీఎం కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేసరికి రామ్మోహన్ నాయుడు 7,348 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. తర్వాత పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్లు సుమారు 23 వేలు ఉండటంతో వాటిని లెక్కించారు అధికారులు. తర్వాత రామ్మోహన్ గెలిచినట్లు ప్రకటించారు. అయితే ఇక్కడ రీకౌంటింగ్ చేయాలని, రిగ్గింగ్‌కి పాల్పడ్డారంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు […]

సిక్కోలు సీటు మళ్లీ రామ్మోహన్‌దే....
Follow us

| Edited By:

Updated on: May 24, 2019 | 5:43 PM

శ్రీకాకుళం పార్లమెంట్ ఫలితంపై తెల్లవారుజాము వరకు హైడ్రామా నడిచింది. ఇక్కడి ఫలితంపై రీకౌంటింగ్ నిర్వహించాలని వైసీపీ అభ్యర్థి డిమాండ్ చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. ఈవీఎం కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేసరికి రామ్మోహన్ నాయుడు 7,348 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. తర్వాత పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్లు సుమారు 23 వేలు ఉండటంతో వాటిని లెక్కించారు అధికారులు. తర్వాత రామ్మోహన్ గెలిచినట్లు ప్రకటించారు. అయితే ఇక్కడ రీకౌంటింగ్ చేయాలని, రిగ్గింగ్‌కి పాల్పడ్డారంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు వైసీపీ అభ్యర్థి శ్రీనివాస్. దీంతో రీకౌంటింగ్ జరిపారు అధికారులు. తీవ్ర ఉత్కంఠ నడుమ మళ్లీ రామ్మోహన్ నాయుడు గెలిచినట్లు ప్రకటించారు. అయితే ఈ ఫలితంపై కోర్టును ఆశ్రయిస్తానని వైసీపీ అభ్యర్థి ప్రకటించారు.