జగన్ సర్కారు తీసుకున్న ఆ నిర్ణయంపై టీడీపీ అభ్యంతరం.. గవర్నర్ కు ఫిర్యాదు
ప్రభుత్వ జీవోలు పబ్లిక్ డొమైనులో పెట్టకూడదని జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు టీడీపీ ఫిర్యాదు చేసింది.
TDP – Governor: ప్రభుత్వ జీవోలు పబ్లిక్ డొమైనులో పెట్టకూడదని జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు టీడీపీ ఫిర్యాదు చేసింది. జీవోలను ఆన్లైన్లో పెట్టకుండా తేదీ, జీవో నెంబర్ వేసి వదిలేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. తెలంగాణ హైకోర్టు జీవోలు ఆన్లైన్లో పెట్టాలని ఆదేశాలిచ్చిందని గుర్తుచేసిన నేతలు, రాత్రి పూట రహస్య జీవోలు విడుదల చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం జీవోలు ఆన్లైన్లో పెడుతుందా లేదా అనేది ఒక వారం రోజులు చూసి తర్వాత కోర్టుకి వెళ్తామని టీడీపీ నేతలు తెలిపారు.
ఈ అంశం మీద టీడీపీ నేతలు వర్ల రామయ్య, బోండా ఉమ, బచ్చుల అర్జునుడు ఏసీ గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. “వారం క్రితం బ్లాంక్ ,రహస్య జీవో లు విడుదల చేస్తోందని గవర్నర్ కి ఫిర్యాదు చేశాము. ఇప్పుడు ఏకంగా జీవో లు ఆన్ లైన్ లో పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా.. ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. మళ్ళీ గవర్నర్ కు ఈ వ్యవహారం పై ఫిర్యాదు చేశాము. తమిళనాడు, తెలంగాణ హైకోర్టులు అన్ని జీవోలు పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని చెప్పాయి. దొంగల దోపిడి లా .. ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.” అని వర్ల, దేవినేని విమర్శించారు.
రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు. బ్లాంక్ జీవోలపై గవర్నర్ కి పిర్యాదు చేయగానే ఆన్లైన్లో జీవోలు లేకుండా చేశారు. ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి ప్రభుత్వం భయపడుతుంది. జీవోల అంశంపై న్యాయ పోరాటం చేస్తాం. జీవోలు సామాన్యులు మళ్లీ చూసే విధంగా ప్రభుత్వంపై కూడా న్యాయ పోరాటం చేస్తాం అని టీడీపీ నేతలు హెచ్చరించారు.
Read also: Husband and Wife Relations: భార్య, లేదా భర్తకు ఈ మూడు విషయాలు అస్సలు చెప్పొద్దు..! ఎందుకంటే..