- Telugu News Photo Gallery Never share these Three secrets with your partner because it will affect your relationship
Husband and Wife Relations: భార్య, లేదా భర్తకు ఈ మూడు విషయాలు అస్సలు చెప్పొద్దు..! ఎందుకంటే..
Relationship: వివాహ బంధం కలకాలం ఉండాలంటే భార్యాభర్తల మధ్య నమ్మకం, ప్రేమ చాలా ముఖ్యం. స్నేహితుడిలా నిజాయితీతో ఉంటే..
Updated on: Aug 20, 2021 | 8:11 PM

Relationship: భార్యాభర్తల మధ్య నమ్మకం, ప్రేమ చాలా ముఖ్యం. స్నేహితుడిలా నిజాయితీతో ఉంటే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కానీ చాలా సందర్భాలలో భార్యాభర్తలు స్నేహితులుగా ఉండలేరు. సమాజ పరిస్థితులకు కట్టుబడి ఉంటారు. అప్పుడు మీ సంతోషకరమైన సంబంధం దెబ్బతింటుంది. మీ భాగస్వామితో ఎన్నటికీ షేర్ చేయకూడని మూడు విషయాల గురించి తెలుసుకుందాం.

1. వివాహానికి ముందు మీకు గతం ఉంటే దాని గురించి మీ భాగస్వామికి ఎప్పుడూ చెప్పకండి. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్నది మీ భవిష్యత్ మాత్రమే దాని గురించి మాత్రమే ఆలోచించండి. ప్రతిరోజూ మీ ప్రస్తుత బంధాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించండి. వివాహానికి ముందు మీరు మీ భాగస్వామికి మీ గతం గురించి చెప్పినట్లయితే పెళ్లి చేసుకున్న తర్వాత దానిని ఎప్పుడూ ప్రస్తావించవద్దు.

2. ముఖ్యంగా పెళ్లి తర్వాత అమ్మాయి జీవితంలో అనేక సవాళ్లు ఉంటాయి. ఆమె వేరే ఇంటికి వెళ్లి స్థిరపడాలి. అటువంటి పరిస్థితిలో అత్తమామలను సరిగ్గా చూసుకోవాలి. తన భర్త ఎదుట అతడి తల్లిదండ్రులకు చెడు చేయవద్దు. మీకు ఇష్టం లేకపోయినా మీ భాగస్వామి ముందు మీ భావాలను వ్యక్తపరచవద్దు. వారు మీ భర్త తల్లిదండ్రులు అని గుర్తుంచుకోండి. వారికి చెడు చేసినట్లయితే మీ భర్త తట్టుకోలేడని గుర్తించండి.

3. మీరు మీ మాజీతో టచ్‌లో ఉంటే ఈ విషయాన్ని మీ భాగస్వామితో ఎప్పుడూ మాట్లాడవద్దు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఆమె ఈ విషయాన్ని అర్థం చేసుకోదు. మరియు మిమ్మల్ని తప్పుగా అంచనా వేస్తారు. మీ వైవాహిక జీవితాన్ని మెరుగుపరచడానికి మీరు మీ మాజీతో ఎలాంటి సంబంధాన్ని కొనసాగించకపోవడమే మంచిది.



