ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు టీడీపీ అధినేత లేఖ.. లేఖలో చంద్రబాబు ఏమని ఫిర్యాదు చేశారంటే..
చిత్తూరు జిల్లా కుప్పం మండలం మిట్టపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలు చేసిందంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత..
చిత్తూరు జిల్లా కుప్పం మండలం మిట్టపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలు చేసిందంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కుప్పంలో టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని లేఖలో ప్రస్తావించారు. టీడీపీ అభ్యర్థి శివలక్ష్మి భర్త మంజునాథపై అక్రమ కేసు నమోదు చేశారని తెలిపారు.
టీడీపీ నేతలు మనోహర్, మంజునాధ్ పై ఐపిసి సెక్షన్ 448, 323, 506 కింద అక్రమ కేసు నమోదు చేశారని ఎస్‌ఈసీకి రాసిన లేఖలో వివరించారు. వైసీపీ అభ్యర్డులైన అంజలి, కళావతి లు నామినేషన్ ఉపసంహరించుకున్నప్పటికీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి కేసులు నమోదు చేస్తున్నారు. మనోహర్ మంజునాథ్ లపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని చంద్రబాబు కోరారు.
మనోహర్ కు ఎన్నికల సంఘం రక్షణ కల్పించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రశాంతమైన కుప్పంలో కూడా వైసీపీ నాయకులు గొడవలు సృష్టిస్తున్నారు. ఎన్నికల సంఘం దీనిపై తగు చర్యలు వెంటనే తీసుకోవాలని లేఖలో కోరారు చంద్రబాబు. నామినేషన్లు ఉపసంహరించుకున్న కళావతి అంజలి లను పోటీకి దూరంగా ఉంచాలన్నారు. మిట్టపల్లి గ్రామ పంచాయతీలో ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Read more:
హైకోర్టులో మంత్రి కొడాలి నాని పిటిషన్.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ షోకాజ్ నోటీస్‌పై అభ్యంతరం