హైకోర్టులో మంత్రి కొడాలి నాని పిటిషన్‌.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ షోకాజ్‌ నోటీస్‌పై అభ్యంతరం

ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్‌ఈసీ వర్సెస్‌ ప్రభుత్వంగా సీన్‌ మారిన విషయం తెలిసిందే. ఎస్‌ఈసీపై అధికారపార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు..

హైకోర్టులో మంత్రి కొడాలి నాని పిటిషన్‌.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ షోకాజ్‌ నోటీస్‌పై అభ్యంతరం
Kodali Nani
Follow us

|

Updated on: Feb 13, 2021 | 12:12 PM

ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్‌ఈసీ వర్సెస్‌ ప్రభుత్వంగా సీన్‌ మారిన విషయం తెలిసిందే. ఎస్‌ఈసీపై అధికారపార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శలు చేయడం దానికి ఎస్‌ఈసీ నోటీసులు ఇచ్చే తంతు కొనసాగుతుంది. తొలుత మంత్రి పెద్దిరెడ్డికి నోటీసులు ఇచ్చిన ఎస్‌ఈసీ అనంతరం ఎమ్మెల్యే జోగి రమేష్‌కు నోటీసులిచ్చారు. తాజాగా తనపై అనుచిత వ్యాఖ్యాలు చేశారని మంత్రి కొడాలి నానికి ఏకంగా షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. కొడాలి నాని తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఈ నెల 21 వరకు మీడియాతో మాట్లాడొద్దని కొడాలి నానిని ఆదేశించారు నిమ్మగడ్డ. ఐతే ఎస్‌ఈసీ ఆదేశాలను సవాల్‌ చేస్తూ హైకోర్టుకు వెళ్తున్నారు మంత్రి కొడాలి. హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ వేయనున్నారు.

నిన్న ప్రెస్‌మీట్‌ పెట్టిన గంటలోపే కొడాలికి SEC షోకాజ్‌ ఇస్తే…నిమ్మగడ్డ పెట్టిన డెడ్‌లైన్‌కు రెండు గంటల ముందే వివరణ ఇచ్చారు నాని. ప్రెస్‌మీట్‌లో తానెక్కడా ఎన్నికల కమిషన్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. ఎలాంటి దురుద్దేశ వ్యాఖ్యలు కూడా చేయలేదన్నారు. తొలి దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపైనే తాను మాట్లాడానని, ప్రతిపక్షాల వ్యాఖ్యలపైనే తాను విమర్శలు చేశానని పేర్కొన్నారు. తన వివరణను పరిశీలించి షోకాజ్‌ నోటీసును వెనక్కి తీసుకోవాలని SECని కోరారు కొడాలి నాని.

గ్రామీణ ప్రాంతాల్లో రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలను ఆపడంతో SECపై విమర్శలు చేశారు నాని. ప్రెస్‌మీట్‌ అయిన…గంటలోపే ఆయనకు షోకాజ్‌ నోటీసు వెళ్లింది. సాయంత్రం 5 గంటల్లోపు వివరణ ఇవ్వాలని కొడాలికి షోకాజ్‌ నోటీస్ ఇచ్చారాయన. దానికి రెండు గంటల ముందే వివరణ ఇచ్చారు కొడాలి నాని. ఐనా ఈ నెల 21 వరకు మీడియాతో మాట్లాడొద్దని ఆదేశించారు. ఈ అంశంపైనే ఇవాళ హైకోర్టుకు వెళ్తున్నారు కొడాలి నాని.

Read more:

మున్సిపల్‌ ఎన్నికలే కాదు… ఏ ఎన్నికలకైనా సిద్ధం..ఎన్నికలకు భయపడే పార్టీ వైసీపీ కాదన్న మంత్రి వెల్లంపల్లి