మున్సిపల్ ఎన్నికలే కాదు… ఏ ఎన్నికలకైనా సిద్ధం..ఎన్నికలకు భయపడే పార్టీ వైసీపీ కాదన్న మంత్రి వెల్లంపల్లి
ఏపీలో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొదటి దశ ఎన్నికలు ముగిసి ఫలితాలు కూడా వచ్చేశాయి. ఇక మరో మూడు దశలు ఎన్నికలు..
ఏపీలో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొదటి దశ ఎన్నికలు ముగిసి ఫలితాలు కూడా వచ్చేశాయి. ఇక మరో మూడు దశలు ఎన్నికలు ముగిసిన అనంతరం మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుందంటూ ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు.
మున్సిపల్ ఎన్నికలే కాదు… ఏ ఎన్నికలకైనా సిద్ధమన్నారు మంత్రి వెల్లంపల్లి. ఎన్నికలకు భయపడే పార్టీ వైసీపీ కాదన్నారు. SEC ఇప్పటికీ ఏకపక్షంగానే వ్యవహరిస్తోందన్నారు. మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై ఎందుకు చర్యలు తీసుకోలేదే చెప్పాలన్నారు.
మున్సిపల్ పోల్స్‌కు నగారా మోగుతుందన్న ప్రచారం నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వర్సెస్ ప్రభుత్వంగా మారింది సీన్ ఇక పంచాయతీ ఎన్నికల ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్‌ఈసీ సిద్ధమవుతుండటం రాజకీయంగా ఆసక్తిని రేపుతుంది.
Read more:
ఏపీలో అధికారపార్టీ నేతలకు కొనసాగుతున్న నోటీసుల పర్వం.. ఈసారి ఆ మంత్రిపై ఎస్‌ఈసీ కన్నెర్ర