ఏపీలో అధికారపార్టీ నేతలకు కొనసాగుతున్న నోటీసుల పర్వం.. ఈసారి ఆ మంత్రిపై ఎస్‌ఈసీ కన్నెర్ర

ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నేతలకు నోటీసుల పర్వం కొనసాగుతుంది. మొన్న పెద్దిరెడ్డి, నిన్న జోగి రమేష్‌. ఇప్పుడు..

ఏపీలో అధికారపార్టీ నేతలకు కొనసాగుతున్న నోటీసుల పర్వం.. ఈసారి ఆ మంత్రిపై ఎస్‌ఈసీ కన్నెర్ర
Follow us
K Sammaiah

|

Updated on: Feb 12, 2021 | 12:14 PM

ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నేతలకు నోటీసుల పర్వం కొనసాగుతుంది. మొన్న పెద్దిరెడ్డి, నిన్న జోగి రమేష్‌. ఇప్పుడు కొడాలి నాని. ఇలా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్నారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ద్దిరెడ్డి, ఎమ్మెల్యే జోగి రమేష్‌లపై ఏకంగా మీడియాతో మాట్లాడొద్దంటూ ఆదేశాలు ఇస్తే… వివరణ ఇవ్వాలంటూ మంత్రి కొడాలి నానీకి షోకాజ్‌ నోటీసు జారీ చేయడం సంచలనంగా మారింది.

తాడేపల్లి వైసీపీ ఆఫీస్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టారు మంత్రి కొడాలి నాని. గ్రామీణ ప్రాంతాల్లో రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలను ఆపడంతో SECపై విమర్శలు చేశారు. ప్రెస్‌మీట్‌ అయిన… గంటలోపే ఆయనకు షోకాజ్‌ నోటీసు వెళ్లింది. సాయంత్రం 5 గంటలలోపు వివరణ ఇవ్వాలని కొడాలికి షోకాజ్‌ నోటీసు ఇచ్చారాయన.

మరి ఎస్‌ఈసీ షోకాజ్‌ నోటీసుకు నాని వివరణ ఇస్తారా… ఇవ్వరా? ఇస్తే ఏ రకంగా తన విమర్శలను సమర్ధించుకుంటారు? ఇవ్వకపోతే నిమ్మగడ్డ రియాక్షన్‌ ఎలా ఉంటుందనేది ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.