AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంటలను నాశనం చేస్తున్న అడవి పందుల కాల్చివేత నిర్ణయాన్ని స్వాగతించిన షూటర్లు.. స్వచ్ఛందంగా పనిచేసేందుకు సుముఖత

రైతుల పంటలను నాశనం చేస్తున్న అడవి పందులను కాల్చివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని..

పంటలను నాశనం చేస్తున్న అడవి పందుల కాల్చివేత నిర్ణయాన్ని స్వాగతించిన షూటర్లు.. స్వచ్ఛందంగా పనిచేసేందుకు సుముఖత
K Sammaiah
|

Updated on: Feb 12, 2021 | 11:53 AM

Share

రైతుల పంటలను నాశనం చేస్తున్న అడవి పందులను కాల్చివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని లైసెన్స్ డ్ షూటర్ల బృందం స్వాగతించింది. ఎలాంటి రుసుము తీసుకోకుండా ఈ కార్యక్రమంలో పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

కాల్చివేతకు అనుమతి ఉన్న 30 మంది షూటర్ల ఎంపానెల్ జాబితాను అటవీ శాఖ ఇప్పటికే వ్యవసాయ, హార్టీకల్చర్, పంచాయితీ రాజ్ శాఖలకు పంపింది. వీరిలో కొంతమంది అరణ్య భవన్ లో ఉన్నతాధికారులను కలిశారు. రైతులను తీవ్ర ఇబ్బంది పెడుతున్న అడవి పందుల విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని, అటవీ శాఖ ఆదేశాల మేరకు తాము పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని తెలుపుతూ పీసీసీఎఫ్ ఆర్. శోభకు లేఖను అందచేశారు.

సాధ్యమైనంతవరకు గ్రామ పంచాయితీల నుంచి అనుమతి వచ్చిన 48 గంటల్లోగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. కొద్ది మంది షూటర్లు పందుల కాల్చివేతకు రుసుము డిమాండ్ చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చిందని, మేము అందులో భాగం కాదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించకుండా సొంత ఖర్చుతో, స్వచ్చందంగా కాల్చివేతలో పాల్గొంటామని తెలిపారు.

Read more:

బెంగుళూరులో టూరులో వైయస్‌ షర్మిల.. రెండు రాష్ట్రాలకు దూరంగా వ్యూహ రచన చేసేందుకేనంటున్న పరిశీలకులు

సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?