టీడీపీ ఎమ్మెల్యే మరోసారి రాజీనామా లేఖ.. సర్వత్రా విమర్శలతో స్పీకర్ ఫార్మాట్‌లో తిరిగి రాజీనామా
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీలో ఉద్యమం ఊపందుకుంది. గత కొన్ని రోజులుగా అఖిలపక్ష కార్మికులు విశాఖలో..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీలో ఉద్యమం ఊపందుకుంది. గత కొన్ని రోజులుగా అఖిలపక్ష కార్మికులు విశాఖలో ర్యాలీలు, ధర్నాలు చేపడుతున్నారు. అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో అందరికంటే ముందు తన పదవికి రాజీనామ చేసి ప్రత్యేకతను చాటుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.
అయితే గంటా శ్రీనివాస రావు ఇచ్చిన రాజీనామా లేఖ స్పీకర్ ఫార్మాట్‌లో లేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అఖిలపక్షాల ధర్నా వేదికపై నుంచి మరోసారి రాజీనామా అస్త్రాన్ని సంధించారు TDP MLA గంటా శ్రీనివాసరావు.
ఇటీవలే రాజీనామా చేసినా ఆ లేఖ స్పీకర్ ఫార్మాట్‌లో లేదు. దాంతో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మరో రెండు రాజీనామా లేఖలపైనా సంతకం చేశారు గంటా. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖ శారు. దీన్ని ఎలాగైనా ఆమోదింపజేయాలన్నారు. గంటా తాజా రాజీనామాతో అటు వైసీపీ నేతలపైనా ఒత్తిడి పెరుగుతోంది. ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు రాజీనామా చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది.
Read more: