ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఇంటి అద్దెపై యూఎఫ్‌ఆర్‌టీఐ ఫోకస్‌.. ఆ ఆరోపణలపై విచారణ జరపాలని గవర్నర్‌ ఆదేశించినట్లు వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ నివాసం ఉంటున్న ఇంటి అద్దెపై యునైటెడ్‌ ఫోరం ఫర్‌ ఆర్టీఐ క్యాంపెయిన్‌(యూఎఫ్‌ఆర్టీఐ) ఫోకస్‌..

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఇంటి అద్దెపై యూఎఫ్‌ఆర్‌టీఐ ఫోకస్‌.. ఆ ఆరోపణలపై విచారణ జరపాలని గవర్నర్‌ ఆదేశించినట్లు వెల్లడి
K Sammaiah

|

Feb 12, 2021 | 11:01 AM

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ నివాసం ఉంటున్న ఇంటి అద్దెపై యునైటెడ్‌ ఫోరం ఫర్‌ ఆర్టీఐ క్యాంపెయిన్‌(యూఎఫ్‌ఆర్టీఐ) ఫోకస్‌ పెట్టింది. రాష్ట్రంలో నివాసమే ఉండకుండా ప్రతినెలా ఇంటి అద్దె అలవెన్స్‌ పొందుతున్నట్టుగా గతంలో ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో విచారణ జరిపి చర్యలు చేపట్టాలంటూ గవర్నర్‌ కార్యాలయం ఆదేశించినట్టు యూఎఫ్‌ఆర్‌టీఐ ప్రతినిధులు తెలిపారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఇంటి అద్దె విషయంలో నిజానిజాలు తేల్చాలంటూ ఈ మేరకు తమకు గవర్నర్‌ కార్యాలయం సమాచారమిచ్చిందని యూఎఫ్‌ఆర్టీఐ ప్రతినిధులు వెల్లడించారు.

నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌పై యూఎఫ్‌ఆర్‌టీఐ ప్రతినిధులు గత డిసెంబర్‌ 14న గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి తదుపరి చర్యలు ఏం తీసుకున్నారో తెలియజేయాలని కోరుతూ యూఎఫ్‌ఆర్‌టీఐ ప్రతినిధులు జంపాన శ్రీనివాసగౌడ్, నస్రీన్‌బేగంలు తాజాగా గవర్నర్‌ కార్యాలయం నుంచి సమాచారం కోరారు.

దీనికి గవర్నర్‌ కార్యాలయ కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ బదులిస్తూ.. ఆ ఫిర్యాదుపై తగిన విచారణ జరిపి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శిని డిసెంబర్‌ 24న ఆదేశించినట్టు తెలిసినట్టు వారు పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం వర్సెస్‌ ఎస్‌ఈసీగా మారిన నేపథ్యంలో నిమ్మగడ్డ ఇంటి అద్దె వ్యవహారం మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది.

Read more:

బెంగుళూరులో టూరులో వైయస్‌ షర్మిల.. రెండు రాష్ట్రాలకు దూరంగా వ్యూహ రచన చేసేందుకేనంటున్న పరిశీలకులు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu