బెంగుళూరులో టూరులో వైయస్ షర్మిల.. రెండు రాష్ట్రాలకు దూరంగా వ్యూహ రచన చేసేందుకేనంటున్న పరిశీలకులు
తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామంటూ ప్రత్యేక పార్టీ ఏర్పాట్లలో తలమునకలై ఉన్న ఏపీ సీఎం వైయస్ రాజశేఖర్‌రెడ్డి సోదరి, వైఎస్ షర్మిల బెంగుళూరుకు..
తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామంటూ ప్రత్యేక పార్టీ ఏర్పాట్లలో తలమునకలై ఉన్న ఏపీ సీఎం వైయస్ రాజశేఖర్‌రెడ్డి సోదరి, వైఎస్ షర్మిల బెంగుళూరుకు టూర్ ఏశారు. తొలుత నల్లగొండ జిల్లా వైయస్ రాజశేఖర్‌రెడ్డి అభిమానులతో సమావేశం నిర్వహించిన షర్మిల.. అనంతరం ఖమ్మం జిల్లాకు చెందిన అభిమానులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సమావేశం ముగిసిన వెంటనే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లారు.
ఈ విషయాన్ని షర్మిల అధికార ప్రతినిధి కొండా రాఘవ రెడ్డి వెల్లడించారు. మరో మూడు రోజుల పాటు షర్మిల బెంగళూరులోనే ఉంటారని స్పష్టం చేశారు. ఆపై ఆమె హైదరాబాద్ కు వస్తారని, ఆపై పార్టీ నిర్మాణ కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో దృష్టిని సారిస్తారని చెప్పారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేతో భేటీపై స్పందించిన ఆయన, వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తున్న సమయంలో వెన్నంటి నడిచిన వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డని, వారిద్దరి మధ్యా కేవలం మర్యాద పూర్వక భేటీ మాత్రమే జరిగిందని స్పష్టం చేశారు.
అయితే తెలంగాణలో పార్టీ ఏర్పాటు విషయంలో అన్ని వ్యూహాలు బెంగుళూరులోనే రచిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణలో గానీ, ఏపీలో గానీ షర్మిలతో వైసీపీ నేతుల భేటీ కావడంపై పలు అనుమానాలకు తావిస్తున్నందున రెండు రాష్ట్రాలకు దూరంగా పార్టీ ఏర్పాటుపై వ్యూహ రచన చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Read more: