జీతాలు పెంచమంటే వాలంటీర్లంటారా..? ఎమ్మెల్యే.. ఎంపీలు ప్రజా సేవకులు కాదా.. వారికి జీతాలెందుకు -రామకృష్ణ

ఏపీలో వేతనాలు పెంచాలని గ్రామ, వార్డు వాలంటీర్లు ఆందోలనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నవరత్నాలపై సమీక్ష సందర్భంగా వాలంటీర్..

జీతాలు పెంచమంటే వాలంటీర్లంటారా..? ఎమ్మెల్యే.. ఎంపీలు ప్రజా సేవకులు కాదా.. వారికి జీతాలెందుకు -రామకృష్ణ
K Sammaiah

|

Feb 12, 2021 | 10:04 AM

ఏపీలో వేతనాలు పెంచాలని గ్రామ, వార్డు వాలంటీర్లు ఆందోలనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నవరత్నాలపై సమీక్ష సందర్భంగా వాలంటీర్‌ అంటేనే ప్రజలకు సేవ చేసేవారని సీఎం వ్యాఖ్యానించడంపై సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు పెంచమని అడిగితే వాలంటీర్లను ఉద్యోగస్తుల నుంచి సేవకులుగా మారుస్తారా అంటూ రామకృష్ణ మండిపడ్డారు.

జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజున నవరత్న పథకాలు అమలుకు వాలంటీర్లను నియమించి, రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. “మాట తప్పం – మడమ తిప్పం’ అన్న సీఎం ఇప్పుడు వాలంటీర్లను సేవకులుగా గుర్తిస్తూ లేఖ రాయటం ఏమనాలని రామకృష్ణ ప్రశ్నించారు.

ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రజాప్రతినిధులు కూడా ప్రజాసేవకులే కదా? వారికి నెలకు వేతనాలు, ఖర్చుల రూపంలో లక్షలాది రూపాయలు చెల్లించటం ఎందుకన్నారు. ఎమ్మెల్యేలకు కూడా వాలంటీర్లలాగా నెలకు రూ.5 వేలు ఇస్తే సరిపోతుంది కదా అని రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో నియమించబడిన 2.5 లక్షల వాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తోందని విమర్శించారు.

సీఎం జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వాలంటీర్లకు వేతనం పెంచి నెలకు రూ. 12 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వాలంటీర్లకు ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Read more:

వైసీపీని ఇబ్బంది పెట్టేందుకే పంచాయతీ ఎన్నికలు.. ఆ విషయంలో వారి కుట్రలు సాగలేదన్న మంత్రి బాలినేని

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu