వైసీపీని ఇబ్బంది పెట్టేందుకే పంచాయతీ ఎన్నికలు.. ఆ విషయంలో వారి కుట్రలు సాగలేదన్న మంత్రి బాలినేని
ఏపీలో పంచాయతీ ఏన్నికలపై అధికార పార్టీ వైసీపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. ఇప్పటికే తొలి దశ..
ఏపీలో పంచాయతీ ఏన్నికలపై అధికార పార్టీ వైసీపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. ఇప్పటికే తొలి దశ ఎన్నికలు ముగిసి, రెండోదశ ఎన్నికలకు సిద్ధమవుతున్నా ఎస్‌ఈసీపై మంత్రుల విమర్శలు కొనసాగుతునే ఉన్నాయి. ఎన్నికల కమీషన్ గతంలో నిలిపివేసిన ఎంపీటీసీ, జడ్పీటీ ఎన్నికలు నిర్వహించకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించి వైసీపీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నించిందని మంత్రి బాలినేని ఆరోపించారు.
అయితే ప్రజలు వైసీపీ మద్దతుదారులకు పంచాయతీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిపెట్టారని ఎపి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి తెలిపారు. తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మద్దతిచ్చిన అభ్యర్ధులు ఘనవిజయం సాధించారని చెప్పారు. ఒంగోలు డివిజన్‌లో టీడీపీకి మంచి పట్టున్న ప్రాంతంలో వైసీపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుందన్నారు. ఒక్క ఒంగోలు నియోజకవర్గంలోనే 28 పంచాయతీలు ఉంటే 24 స్థానాలను సొంతం చేసుకున్నామని చెప్పారు.
సీఎం జగన్ సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు జైకొట్టి, వైసీపీ మద్దతిచ్చిన అభ్యర్ధులను గెలిపించుకున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైసీపీ ప్రభంజనం కనిపిస్తోందని, చంద్రబాబు పన్నిన కుట్రలను ఓటర్లు భగ్నం చేశాశారన్నారు. ఎస్ఈసీని అడ్డుపెట్టుకోని టిడిపి చేసిన కుట్రలను ప్రజలు తిప్పికొట్టారన్నారు… టీడీపీకి కంచుకోటగా ఉన్న తన స్వగ్రామం కొణిజేడులో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వైసీపీ మద్దతుదారుడు సొంతం చేసుకున్నారని చెప్పారు.
Read more:
సీబీఐ నోటుసులపై స్పదించిన ఆమంచి.. వారిపై తానెలాంటి వ్యాఖ్యలు చేయలేదన్న చీరాల మాజీ ఎమ్మెల్యే