సీబీఐ నోటుసులపై స్పదించిన ఆమంచి.. వారిపై తానెలాంటి వ్యాఖ్యలు చేయలేదన్న చీరాల మాజీ ఎమ్మెల్యే

న్యాయ స్థానాలు, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు తానెప్పుడూ చేయలేదని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ తెలిపారు... విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌ కేసును..

సీబీఐ నోటుసులపై స్పదించిన ఆమంచి.. వారిపై తానెలాంటి వ్యాఖ్యలు చేయలేదన్న చీరాల మాజీ ఎమ్మెల్యే
Follow us
K Sammaiah

|

Updated on: Feb 12, 2021 | 9:31 AM

న్యాయ స్థానాలు, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు తానెప్పుడూ చేయలేదని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ తెలిపారు… విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌ కేసును సిబిఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఓ బహిరంగ సభలో తన అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేశానన్నారు… ఒక పౌరుడిగా తన అభిప్రాయాలు తెలియచేశానేకానీ, న్యాయవ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తించలేదన్నారు… తాను సోషల్‌ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టలేదని, వ్యాఖ్యానాలు చేయలేదన్నారు… చీరాలలో వైయస్‌ఆర్‌ జయంతి సందర్భంగా జరిగిన సభలో హైకోర్టు తీర్పుపై తన అభిప్రాయం తెలియచేశానన్నారు. ఇదే విషయాన్ని ఈనెల 12 విశాఖ సిబిఐ కోర్టుకు హాజరై చెబుతానన్నారు…

మరోవైపు ఈ కేసులో ఈనెల ఫిబ్రవరి 6వ తేదీన విచారణ కోసం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని సీబీఐ విశాఖపట్నం డిఎస్పి వి.శ్రీనివాసరావు గతంలో ఆమంచికి నోటీసులు పంపించారు… అయితే ఎన్నికల నేపద్యంలో మరోసారి హాజరుకాగలనని సిబిఐకి ఆమంచి తెలియచేయడంతో ఈనెల 12న హాజరుకావాలని తిరిగి ఆమంచికి సిబిఐ కార్యాలయం నుంచి నోటీసు ఇచ్చారు… దీంతో రేపు ఆమంచి విశాఖ సిబిఐ కోర్టులో హాజరై తన వివరణను ఇవ్వనున్నారు…

విశాఖపట్నానికి చెందిన డాక్టర్ సుధాకర్ కేసుని హైకోర్టు సీబీఐకి అప్పగిస్తూ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆమంచితో సహా రాష్ట్రంలోని వైసీపీ నేతలు పలువురు కోర్టు తీర్పుని విమర్శించారు. కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులకు కనీస రక్షణ సామగ్రి లేదని డాక్టర్ సుధాకర్ బహిరంగంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్‌ ను పోలీసులు నిర్బంధించడం, మానసికస్థితి సరిగ్గా లేదంటూ మెంటల్ హాస్పిటల్ కు తరలించటం వంటి పరిణామాలు చోటు చేసుకోగా హైకోర్టు వరకు విషయం వెళ్లింది. ఈ కేసు విచారణను హైకోర్టు సీబీఐకి అప్పగించింది.

ఈ తీర్పుపై వైసిపి నేతలు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ , చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తదితరులు విమర్శలు చేశారు. గత ఏడాది జులై 8న దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని చీరాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమంచి కోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా వ్యాఖ్యలు చేసిన మొత్తం 98 మంది వైసిపి నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలు హైకోర్టుకి, ఆ తీర్పునకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసారు. దీనిపై ఆగ్రహించిన హైకోర్టు వీరందరి మీదా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో 2020 నవంబర్‌ 11వ తేదిన విశాఖలో సిబిఐ అధికారులు వైసిపి నేతలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు… విచారణ చేపట్టిన సీబీఐ అందుబాటులో ఉన్నవారికి నోటీసులు పంపింది… దీనిలో భాగంగానే ఆమంచికి కూడా నోటీసులు ఇచ్చారు. రేపు ఆమంచి విశాఖలోని సిబిఐ అధికారుల ఎదుట హాజరై తన వివరణను ఇవ్వనున్నారు.

Read more:

తెలంగాణ ఉద్యోగులకు షాక్.. పీఆర్సీ అమలుకు అడ్డంకిగా మారిన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌..

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..