AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కవితని పర్సనల్‌ టార్గెట్ చేసిన తరుణ్ చుగ్, సీబీఐ ఎంక్వైరీ కోరతామన్న టీబీజేపీ ఇంచార్జి, మండిపడుతున్న గులాబీదళం

టీఆర్‌ఎస్‌ పార్టీ టార్గెట్‌గా, తెలంగాణ సర్కారుపై ఇప్పటివరకూ విమర్శలు ఎక్కుపెట్టిన బీజేపీ, ఈసారి కేసీఆర్ తనయి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై గురిపెట్టింది...

కవితని పర్సనల్‌ టార్గెట్ చేసిన తరుణ్ చుగ్, సీబీఐ ఎంక్వైరీ కోరతామన్న టీబీజేపీ ఇంచార్జి, మండిపడుతున్న గులాబీదళం
Venkata Narayana
|

Updated on: Feb 23, 2021 | 4:02 PM

Share

టీఆర్‌ఎస్‌ పార్టీ టార్గెట్‌గా, తెలంగాణ సర్కారుపై ఇప్పటివరకూ విమర్శలు ఎక్కుపెట్టిన బీజేపీ, ఈసారి కేసీఆర్ తనయి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై గురిపెట్టింది. కోల్‌బెల్ట్‌ ఏరియాలో పర్యటించిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఇంచార్జి తరుణ్‌చుగ్, టీఆర్‌ఎస్‌పై సీబీఐ ఎంక్వైరీ కోరతామన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితని కూడా పర్సనల్‌గా టార్గెట్‌ చేశారు. యూనియన్‌ లీడర్‌గా సింగరేణి కాలరీస్‌ని కవిత తన గుప్పెట్లో పెట్టుకున్నారని విమర్శించారు తరుణ్‌చుగ్‌ విమర్శించారు. దోపిడీ దొంగలను బీజేపీ ఎప్పుడూ వదిలిపెట్టలేదని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ అవినీతిపై కేంద్ర హోంశాఖ, సీబీఐకి నివేదిస్తామన్నారు. దోషులకు శిక్షపడకుండా వదిలిపెట్టబోమన్నారు తరుణ్‌చుగ్‌.

అంతే, తరుణ్‌చుగ్‌ వ్యాఖ్యలపై సీరియస్‌గా రియాక్ట్‌ అవుతున్నారు గులాబీ దండు. కవితపై తరుణ్‌చుగ్ వ్యాఖ్యలను బోధన్‌ టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే షకీల్‌ తీవ్రంగా ఖండించారు. కవిత వచ్చాకే సింగరేణికి పూర్వ వైభవం వచ్చిందని, రాజకీయ అరాచకాలు తగ్గాయన్నారు షకీల్‌. నిఘా సంస్థలు తమ జేబులో ఉన్నట్లు బీజేపీ నేతలు బెదిరిస్తున్నారని, దమ్ముంటే అవినీతి ఆరోపణల్ని నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లే బీజేపీ నేతల పరిస్థితి ఉందన్నారు చెన్నూరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌. బండి సంజయ్‌ బుడ్డర్‌ఖాన్‌ మాటలు మాని.. చేతనైతే సింగరేణి కార్మికులకు మేలు చేయాలన్నారు. అటు, తరుణ్‌చుగ్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ అన్నట్లు.. సింగరేణి కార్మిక సంఘ నేతలు సైతం రియాక్ట్‌ అవుతున్నారు.

Read also :

మనం రెడీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సిద్ధం, కేబినెట్ భేటీలో మంత్రులకు తేల్చిచెప్పిన సీఎం జగన్