Tamil Nadu: అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ అదే రచ్చ.. గవర్నర్ మైక్ కట్ చేసిన స్పీకర్..!
గవర్నర్‌గా తమిళనాడుకు ఆర్.ఎన్. రవి వచ్చిన తొలినాళ్ల నుంచి ఇదే జరుగుతోంది. అనేక అంశాల్లో తలెత్తిన సమస్యలతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడానికి కారణమైంది. ఇదే అంశంపై గతంలో బహిరంగంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, డీఎంకే ముఖ్య నేతలు గవర్నర్ రవి టార్గెట్‌గా విమర్శలు చేశారు. గతంలో గవర్నర్ రవి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి.

తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ మధ్య వివాదం ఇప్పట్లో.. కాదు ఎప్పటికీ సర్దుమణిగేలా లేదు. ఆర్.ఎన్. రవి తమిళనాడు గవర్నర్‌గా నియమితులైన నాటి నుంచి డీఎంకే ప్రభుత్వంతో అన్నీ వివాదాలే.. ప్రభుత్వం కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు, అసెంబ్లీలో ఆమోదం తెలిపిన తీర్మానాలు గవర్నర్ దగ్గరే నెలలు తరబడి పెండింగ్‌లో ఉండడం.. ఈ విషయంపై రచ్చ అసెంబ్లీ నుంచి సుప్రీంకోర్టు ను ఆశ్రయించడం.. కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం వరకూ వచ్చింది. ఇకపై అన్నీ సర్దుకుంటాయి అనుకుంటుండగా తాజాగా మొదలైన అసెంబ్లీ సమావేశాల్లో సందర్భంగా కూడా మళ్లీ రచ్చ మొదలైంది. ఈ సారి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ మైక్ కట్ చేసేదాకా వివాదం ముదిరింది. ఈసారి రచ్చకు కారణం ఏంటి..?
గవర్నర్‌గా తమిళనాడుకు ఆర్.ఎన్. రవి వచ్చిన తొలినాళ్ల నుంచి ఇదే జరుగుతోంది. అనేక అంశాల్లో తలెత్తిన సమస్యలతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడానికి కారణమైంది. ఇదే అంశంపై గతంలో బహిరంగంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, డీఎంకే ముఖ్య నేతలు గవర్నర్ రవి టార్గెట్‌గా విమర్శలు చేశారు. గతంలో గవర్నర్ రవి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి.
అయితే తాజాగా డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగంలో ఉన్న అంశాలను చదవకపోగా, లేని అంశాలను గవర్నర్ ఆర్.ఎన్. రవి ప్రస్తావించారు. అది కాస్తా వివాదంగా మారింది. ప్రసంగంలో ఉన్న అన్నాదురై, కరుణానిధి పేర్లను గవర్నర్ అసెంబ్లీలో చదవకపోగా తమిళనాడు అన్న పేరును మార్చాల్సిన అవసరం ఉంది.. తమిళగం అని మార్చాలి అంటూ ప్రసంగంలో తమిళనాడు అనే పదం ఉన్న చోట తమిళగం అని చదవడం వివాదంగా మారింది. డీఎంకే ఎమ్మెల్యే గవర్నర్ తీరును తీవ్రంగా తప్పుబట్టడంతో గత అసెంబ్లీ సమావేశాల్లో అర్ధాంతరంగా తన ప్రసంగాన్ని మధ్యలో నిలిపేసి వెళ్లిపోయారు.
దీంతో స్పీకర్ మిగిలిపోయిన గవర్నర్ ప్రసంగాన్ని చదివారు. తాజా అసెంబ్లీ సమావేశాల ప్రారంభం కాగానే మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యింది. తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభ నుంచి వెళ్లిపోయిన గవర్నర్ అర్ ఎన్ రవి కాసేపటికి లోక్ భవన్ నుంచి ప్రకటన విడుదల చేశారు. ఎందుకు రచ్చ మొదలైంది.. గవర్నర్ ప్రసంగానికి డీఎంకే అభ్యంతరం ఎందుకు తెలిపింది. గవర్నర్ మైక్ ఆఫ్ చేసి ప్రసంగానికి అనుమతి ఇవ్వని వివరాలను వివరిస్తూ ప్రకటన విడుదల చేశారు.
ఇదిలావుంటే, గవర్నర్ ప్రసంగం కాపీని డీఎంకే ప్రభుత్వం సోమవారం లోక్ భవన్ కు పంపింది. ప్రసంగంలోని అంశాలపై గవర్నర్ అభ్యంతరం తెలిపారు. స్పీచ్ లోని అంశాలను మార్చి పంపాలన్న గవర్నర్ రవి ప్రభుత్వానికి సూచించారు. కుదరదని అసెంబ్లీ కార్యదర్శి చెప్పడంతో అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ తన ప్రసంగంలోని అంశాల్లో అభ్యంతరాలు ఉన్నాయన్నారు. ప్రసంగాన్ని చదవలేనని చెప్పడానికి ప్రయత్నించారు. ఇంతలోనే స్పీకర్ మైక్ కట్ అయింది. సభ నుంచి గవర్నర్ వాక్ అవుట్ చేసి వెళ్ళిపోయారు. కాసేపటికి లోక్ భవన్ నుంచి ప్రకటన విడుదల అయింది.
దీంతో మాట్లాడే సమయంలో మైక్ కట్ చేశారని ప్రభుత్వ ఆలోచనా విధానంలో లోపాలు ఉన్నాయని గవర్నర్ విడదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా విదేశీ పెట్టుబడులు రావడం లేదని, రాష్ట్రంలో ఫోక్సో కేసులు, డ్రగ్స్ వాడకాలు పెరిగిపోయాయని గవర్నర్ అన్నారు. రోజుకు 65 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. అయినా ప్రభుత్వం బాధ్యతగా ఉండడంలేదని ప్రకటనలో గవర్నర్ పేర్కొన్నారు. దీంతో మరోసారి తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ లోక్ భవన్ మధ్య మరింత గ్యాప్ పెరిగినట్టు అయింది. కాగా, గవర్నర్ చర్యను ఎంకే స్టాలిన్ వెంటనే ఖండించారు. ఆయన ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
