బీట్‌రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో నైట్రేట్లు, బీటాలైన్లు, ఫోలేట్, విటమిన్ సి వంటి ఎన్నో పోషకాలు దండిగా ఉన్నాయి
TV9 Telugu
వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీనిని నేరుగా సలాడ్ రూపంలో లేదంటే జ్యూస్ గా చేసి తీసుకుంటూ ఉంటాం
TV9 Telugu
అలాగే బీట్‌రూట్ ను కొందరు ఉడికించి తీసుకుంటూ ఉంటారు. అయితే బీట్‌రూట్ ను పచ్చిగా తీసుకోవడం మంచిదా.. లేదంటే ఉడికించి తీసుకోవడం మంచిదా.. అనే సందేహం చాలా మందికి ఉంటుంది
TV9 Telugu
బీట్‌రూట్ ను నేరుగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే అవకాశం ఉందని చాలా మంది అనుకుంటారు. ఇందులో నిజమెంతో ఇక్క డ తెలుసుకుందాం
TV9 Telugu
సాధారణంగా బీట్‌రూట్ ను పచ్చిగానే తీసుకుంటూ ఉంటారు. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న వారు బీట్‌రూట్ పచ్చిగా తీసుకోవడం అంత మంచిది కాదు. ఉడికించిన బీట్‌రూట్ లో ఫైబర్ మృదువుగా తయారవుతుంది. దీంతో ఇది సులభంగా జీర్ణమవుతుంది
TV9 Telugu
జీర్ణక్రియ సరిగ్గా లేని వారు, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారు ఉడికించిన బీట్‌రూట్ ను తీసుకోవడం మంచిది. పచ్చి దుంపలను తీసుకోవడం వల్ల దీనిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు మేలు కలిగేలా చేసి కడుపు నిండిన భావన కలుగుతుంది
TV9 Telugu
అలాగే ఉడికించిన బీట్‌రూట్ లో ఆక్సలైట్స్ తక్కువగా ఉంటాయి. కనుక మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు ఉడికించిన బీట్‌రూట్ ను తీసుకోవచ్చు. ఉడికించిన బీట్‌రూట్ ను తీసుకోవడం వల్ల దానిలో ఉండే పోషకాలు త్వరగా శరీరానికి అందుతాయి
TV9 Telugu
బీట్‌రూట్ ను ఉడికించి చేయడం వల్ల సూప్ లు, సలాడ్ లు మరింత రుచిగా మారుతాయి. పచ్చి బీట్‌రూట్, ఉడికించిన బీట్‌రూట్ రెండు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 20 లేదా 30 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించి తింటే పోషకాలు పోకుండా ఉంటాయి