ఆకుకూరల్లో పాలకూర చాలా స్పెషల్. పాలకూరలో ఆరోగ్యానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది
TV9 Telugu
మీడియం సైజ్ పాలకూర కట్టలో 100 గ్రాములకు సుమారు 4.4 మి.గ్రా. ఐరన్ ఉంటుంది. రక్తహీనతతో బాధపడే వారు పాలకూరను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది
TV9 Telugu
పాలకూరలో విటమిన్ ఎ, సి, కె, ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తం గడ్డకట్టడంలో, ఎముకలను దృఢంగా చేయడంలో కూడా పాలకూర మనకు సహాయపడుతుంది
TV9 Telugu
అయితే శరీరంలో ఐరన్ స్థాయిలను పెంచడంలో పాలకూర సహాయపడినప్పటికీ అది కొంత వరకు మాత్రమే. ఎందుకంటే మన వయసును బట్టి మన శరీరానికి ఐరన్ అవసరాలు ఉంటాయి
TV9 Telugu
సమతుల్య, పోషకాహారంలో భాగంగా పాలకూరను తీసుకున్నప్పుడే మనం ఐరన్ స్థాయిలను పెంచుకోవచ్చు. అయితే పాలకూరను తీసుకున్నప్పటికీ మన శరీరం దానిలో ఉండే ఐరన్ ను పూర్తిగా శోషణ చేసుకుంటుందా లేదా అని కూడా నిర్దారణ చేసుకోవాలి
TV9 Telugu
అలాగే ఐరన్ స్థాయిలను పెంచుకోవడానికి పాలకూరతో పాటు ఐరన్ ఉండే ఇతర ఆహారాలను తీసుకోవడం చేయాలి. నాన్ హీమ్ ఐరన్ శరీరంలో త్వరగా శోషించబడదు. కనుక విటమిన్ సి ఉండే ఆహారాలను తీసుకోవడం కూడా ముఖ్యం
TV9 Telugu
పాలకూరను టమాటాలతో కలిపి తీసుకోవడం వల్ల దానిలో ఉండే నాన్ హీమ్ ఐరన్ ను శరీరం కొంత వరకు మాత్రమే గ్రహిస్తుంది. అలాగే పాలకూర మన శరీరంలో కొంత వరకు మాత్రమే ఐరన్ స్థాయిలను పెంచుతుంది
TV9 Telugu
కనుక ఐరన్ కోసం పూర్తిగా పాలకూరపై ఆధారపడడం మంచిది కాదు. ఇక తీవ్ర రక్తహీనతతో బాధపడే వారు వైద్యుడిని సంప్రదించి ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది